Pancard Correction: పాన్‌కార్డులో తప్పులుంటే ఇంట్లో కూర్చుని ఇలా సరిచేసుకోండి
Pancard Correction: పాన్‌కార్డు లో సాధారణంగా చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. పేరులో లేదా ఇంటి పేరులో లేదా చిరునామా లేదా పుట్టిన తేదీలో తప్పులు వస్తుంటాయి. అయితే పాన్‌కార్డులో తప్పుల్ని సరిదిద్దడం ఎలాగో తెలుసుకుందాం..
Pancard Correction: పాన్‌కార్డులో వివరాలు సరిగ్గా లేకపోతే సమస్యలు ఎదురౌతాయి. అందుకే స్పెల్లింగ్ తప్పులు, ఆధార్ కార్టులో పొరపాట్లు ఉంటే తప్పనిసరిగా సరిచేసుకోవాలి. పాన్‌కార్డులో తప్పుల్ని సరిచేయడాన్ని ఇన్‌కంటాక్స్ శాఖ సులభతరం చేసింది. ఆ వివరాలు మీ కోసం..
పాన్‌కార్డులో తప్పులుంటే చాలా సులభంగా సరిదిద్దుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో మీ పాన్‌కార్డులో మీ పేరులో ఏమైనా తప్పున్నా, పుట్టిన తేదీ వివరాలు తప్పుగా ఉన్నా, చిరునామా తప్పులున్నా సరి చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఎందుకంటే పాన్‌కార్డు అనేది అతి ముఖ్యమైన డాక్యుమెంట్. కేవలం ట్యాక్స్ కోసమే కాకుండా ఓ గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంటుంది. పాన్‌కార్డును ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేస్తుంటుంది. ఇందులో పది అంకెల ఆల్ఫా న్యూమెరిక్ కోడ్ ఉంటుంది. మీకు పాన్‌కార్డు సరైన వివరాలతో రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పొరపాట్లు లేదా తప్పుల్ని సరి చేసుకోవచ్చు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. అందులో పాన్‌కార్డు సర్వీసెస్ ఎంచుకుని ఛేంజ్,కరెక్షన్ క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ మెనూలోంచి పాన్‌కార్డు వివరాలు తీసుకోవాలి. ఇప్పుడిందులో రెండు విదానాలుంటాయి. ఒకటి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆధారంగా, రెండవది డిజిటల్ విధానం. ఇందులో పేపర్‌లెస్ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ బేస్డ్ ఇ కేవైసీ ఎంచుకోవాలి. ఇప్పుడు ఆధార్ బేస్డ్ ఇ సైన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇప్పుడు మీ పాన్‌కార్డు ఎంటర్ చేసి మిగిలిన ప్రక్రియ పూర్తి చేయాలి. ఇప్పుడు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. అప్లికేషన్‌లో వివరాలు పూర్తి చేసి అవసరమైన చెల్లింపు పూర్తి చేయాలి. ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇ కేవైసీ నిమిత్తం ఓటీటీ జనరేట్ అవుతుంది. ఓటీపీ ఆధారంగా ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆధార్‌ను బట్టి పాన్‌కార్డు పేరు మార్చుకునే ప్రక్రియ పూర్తి చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook