Ibps Rrb Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 9,053 పోస్టులకు భారీ నోటిఫికేషన్.. ఈ రోజే లాస్ట్ డేట్.. అప్లై చేయకపోతే ఇలా చేయండి..

Ibps Rrb Recruitment 2023: కేంద్ర ప్రభుత్వం ఐబీపీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు ఈ నోటిఫికేషన్లు 9000 పోస్టులకు పైగా భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు మీరు అప్లై చేశారా..? చేయకపోతే ఇప్పుడే అప్లై చేయండి ఈ రోజే లాస్ట్ డేట్..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 28, 2023, 11:26 AM IST
Ibps Rrb Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 9,053 పోస్టులకు భారీ నోటిఫికేషన్.. ఈ రోజే లాస్ట్ డేట్.. అప్లై చేయకపోతే ఇలా చేయండి..

Ibps Rrb Recruitment 2023:x కేంద్ర ప్రభుత్వం ఐబీపీఎస్ RRBల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ దరఖాస్తుకు గడవు ఈరోజు దాకా పొడిగించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఈరోజు రాత్రి దాకా దరఖాస్తు చేసుకునేదాకా అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ ఏలో వివిధ కేటగిరీలైన స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ప్రోబషనరీల్లో దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు 21వ తేదీ ఆఖరు కావడంతో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈరోజు దాకా తొలగించినట్లు తెలుస్తోంది. ఆసక్తి గల నిరుద్యోగులు అధికారిక వెబ్సైట్ అయిన Ibps.In. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ఈ పోస్టులకు అప్లై చేసిన వారు ఫామ్ లో ఏమైనా తప్పులు ఉంటే ఈరోజు వరకే సవరించుకునే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 9,053 భర్తీ కోసం కేంద్రం విడుదల చేసింది. ఇందులో మల్టీపర్పస్ కు సంబంధించిన పోస్టులు 5538 ఉండగా.. ఏపీలో ఈ పోస్టుల సంఖ్య 678 ఉందని అధికారిక సైట్లో పేర్కొన్నారు. ఇక స్కేల్ వన్ పోస్టుల విషయానికొస్తే.. 2485 పోస్టులు ఉండగా.. ఏపీలో 261 జాబులు ఖాళీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్కేల్ 2 పోస్టులు 516 ఉన్నట్లుగా.. ఈ భాగంలోని జనరల్ బ్యాంకింగ్ సంబంధించిన పోస్టులు 332 ఉన్నట్లు సమాచారం.

ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, వయోపరిమితికి సంబంధించిన వివరాలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఆయా సబ్జెక్టులలో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటికే స్కేల్ 2 పోస్టులలో ఔట్సోర్సింగ్ పని చేసిన వారికి ఈ జాబులు సులభంగా లభిస్తాయని సమాచారం.

ఈ నోటిఫికేషన్ లో స్కేల్ 3 పోస్టులకు అప్లై చేసుకుని వారు 20 నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి. స్కేల్ 2 అప్లై చేసుకునే వారి వయస్సు 20 నుంచి 32 సంవత్సరాల మధ్యలోపు ఉండాలని అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ లో స్కేల్ వన్ అప్లై చేసుకుని అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో కు ఉండాలి.

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News