Parakramam Teaser: బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'పరాక్రమం'. తాజాగా ఈ సినిమా టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.  ఈసందర్భంగా దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ - నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యాను. ఎంతో మంది డైరెక్టర్స్‌కు దగ్గర ఆడిషన్స్ ఇచ్చాను. వారికి నా నటన ఆర్ధం కాలేదు. నువ్వేంటి మాట్లాడినట్టు డైలాగ్స్ చెబుతున్నావ్ అంటూ హేళన చేసారు. అందుకే నేను డైరెక్టర్‌గా మెగా ఫోటో పట్టుకున్నాను. ఇక చిన్నపడు చిరంజీవి చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల, పీసీ శ్రీరామ్, శ్రీకర్ ప్రసాద్ వంటి వారు నాపై ప్రభావం చూపించింది. వీళ్లను చూసుకుండు నాలోని టాలెంట్‌ను మెరుగుపరుచుకుంటూ వచ్చాను.
 
నేను దర్శకుడిగా రెండు తమిళ సినిమాలు.. ఒక తెలుగు సినిమా చేశాను. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి. నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్ నని తెలుసుకున్నాను. అప్పుడు నేనే నటించాలని డిసైడ్ అయ్యాను.  నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కల నాది వెల మీది కాన్సెప్ట్ లో యూట్యూబ్ లో ఆ సినిమాలను ఉంచాను. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. వాళ్లకు తోచినంత డబ్బులు సపోర్ట్ చేశారు. అలా పరాక్రమం సినిమా చేసాను.
నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్ కేఎన్, బుచ్చిబాబు , విశ్వక్ సేన్. ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ -
నేను యానిమేషన్ ఎడిటింగ్ కోర్సులు చేస్తున్నప్పటి నుంచి బండి సరోజ్ కుమార్ పేరు వింటున్నాను. ఆయన తమిళ్ లో పోర్కాళం అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఆడలేదు గానీ ఆ మూవీని బాగా ఇష్టపడే ఒక సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులు ఉన్నారు. కోవిడ్ టైమ్ లో బండి సరోజ్ కుమార్ నిర్భందం ట్రైలర్ చూసి ఆయనకు మెసేజ్ పంపాను. మీరు ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించాలని అనుకుంటున్నారు. నాకు నచ్చిందని చెప్పాను. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.  


దర్శకుడు బుచ్చిబాబు సన మాట్లాడుతూ -
ఈ సినిమాకు డీవోపీగా పనిచేసి ప్రసాద్ 100 పర్సెంట్ లవ్ కు వర్క్ చేశారు. అప్పటినుంచి ఆయన నాకు పరిచయం. ప్రేమకథ, పౌర్ణమి సినిమాలకు అవార్డ్స్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ ప్రసాద్. ఈ ఒక్క క్రాఫ్ట్ నే బండి సరోజ్ కుమార్ మీకు వదిలేశాడని అనుకుంటాపే. ఉపేంద్ర గారు కన్నడలో అన్నీ మేజర్ క్రాఫ్ట్స్ ఆయనే చేసుకుంటారు. అలా తెలుగులో బండి సరోజ్ కుమార్ ఉన్నారు. బండి సరోజ్ కుమార్ కల్ట్ మ్యాన్. ఆయన పోర్కాళం సినిమా నా ఫేవరేట్ మూవీ. పరాక్రమం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.


నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ -
బండి సరోజ్ కుమార్ తో నాకున్నది చిన్న పరిచయమే. ఈ పరిచయంలో ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. బండి సరోజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ చూసి ఆయన చెప్పిన సమాధానాలు వింటే ఎంతో జెన్యూన్ గా చెప్పాడనిపించింది. ఈ సినిమాతో బండి సరోజ్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడనిపిస్తోంది.  ఆయనకు ఈ సినిమా రిలీజ్, ప్రమోషన్ విషయంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేసేందుకు ముందుకొస్తాను. చిన్న సినిమాల ఎగ్జిబిషన్ విషయంలో నిర్మాతల మండలికి నాదొక చిన్న సూచన. రెండు మూడో వారం నుంచే చిన్న సినిమాలు పికప్ అవుతాయి కాబట్టి అప్పుడు వచ్చే కలెక్షన్స్ షేర్ లో డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కు ఎక్కువ వాటా ఇవ్వాలని కోరుతున్నా. అన్నారు.


నటుడు మోహన్ మాట్లాడుతూ సేనాపతి మాట్లాడుతూ - నాలోని టాలెంట్  నచ్చి పరాక్రమం సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు బండి సరోజ్ కుమార్. ఆయన ఆ తర్వాత మంచి మిత్రుడిగా మారారు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.


Also Read: KT Rama Rao: రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter