ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య దూరం భారీగా ఉండేది. ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సైతం ఒక వర్గంపై మరొకరు తరచుగా సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకోవడం, అవి పతాక శీర్షికలకు ఎక్కడం జరిగేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అదృష్టవశాత్తుగా ఆ ఇద్దరు హీరోలు కలిసిపోవడంతో ఇద్దరు హీరోలకు చెందిన అభిమానుల మధ్య కూడా స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడింది. పాత గాయాలు మర్చిపోయి ఇటీవలే పవన్ కల్యాణ్ తరుపున రానున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించిన అల్లు అర్జున్ తాజాగా పవర్ స్టార్‌కి మద్దతు ప్రకటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


"లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్‌నెస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్" అని అల్లు అర్జున్ రాసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ అనే కాకుండా మెగా ఫ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ పోస్ట్ చూస్తే, గతం ఏదైనా... ప్రస్తుతానికి అల్లు అర్జున్‌కి పవర్ స్టార్‌పై ఉన్న అభిమానం ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.