PM Awas Yojana: ప్రదానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. పీఎం ఆవాస్ యోజన అప్‌డేట్ ద్వారా చాలామందికి ప్రయోజనం చేకూరనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం ఈ పధకానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2024 వరకూ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఆ పధకం గురించిన వివరాలు మీ కోసం..


పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2.95 కోట్ల పక్కా ఇళ్లు కేటాయించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకూ దాదాపు 2 కోట్ల పక్కా ఇళ్లు పూర్తయ్యాయి. కానీ పక్కా ఇళ్లకు అర్హులైన లబ్దిదారులు ఇంకా పెద్ద సంఖ్యలో మిగిలున్నందున..ప్రధానమంత్రి ఆవాస్ యోజనను 2024 వరకూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాదిమంది గ్రామీణులకు ఉపయోగం కలగనుంది. 


ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 1,43,782 కోట్ల రూపాయలుంటుంది. ఇందులో నాబార్డ్ రుణం వడ్డీ చెల్లింపుల నిమిత్తం 18,676 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ పధకం ద్వారా కొండ ప్రాంతాల్లో 90 శాతం, 10 శాతం ఆధారంగా చెల్లింపులు చేస్తుంది. మిగిలింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం నిష్పత్తిలో భరిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే 100 శాతం కేంద్రమే భరిస్తుంది. 


Also read: Vertical Farming: ఈ పంట సాగుతో రెండు కోట్ల లాభాలు.. ఎలానో తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook