Vertical Farming: ఈ పంట సాగుతో రెండు కోట్ల లాభాలు.. ఎలానో తెలుసుకోండి

Vertical Farming: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి వెర్టికల్ ఫార్మింగ్. ఈ పద్ధతి పాటిస్తే..లక్షలాది రూపాయలు ఆర్జించవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2022, 03:54 PM IST
Vertical Farming: ఈ పంట సాగుతో రెండు కోట్ల లాభాలు.. ఎలానో తెలుసుకోండి

Vertical Farming: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి వెర్టికల్ ఫార్మింగ్. ఈ పద్ధతి పాటిస్తే..లక్షలాది రూపాయలు ఆర్జించవచ్చు.

పుసుపు అనేది అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. పసుపు పంట గురించి అందరికీ తెలిసిందే. కానీ పసుపు పంటతో ప్రతియేటా లక్షల్లో కాదు..కోట్లలో సంపాదించవచ్చంటే మీరు నమ్మలేరు. కానీ నిజమిది. దేశంలో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నివాసాలు, ఫ్యాక్టరీల కారణంగా పొలాలు తక్కువైపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ స్థలంలో పంటల ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించాలంటే కొన్ని కొత్త పద్ధతులు అవలంభించాల్సిందే.

అటువంటి కొత్త పద్ధతే వెర్టికల్ ఫార్మింగ్. ఈ పద్ధతి ద్వారా వ్యవసాయ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు వ్యవసాయం చేస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా ఒక ఎకరా పొలంలో..వందెకరాలకు సమానమైన పంట పండించవచ్చంటున్నారు. మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే..పసుపును వెర్టికల్ ఫార్మింగ్ ద్వారా పండిస్తే..కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు.

వెర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటి

వెర్టికల్ ఫార్మింగ్ అంటే ముందు ఒక జీఐ పైప్ కావల్సి ఉంటుంది. ఈ పైప్‌పై 2-3 అడుగుల లోతు..2 అడుగుల వెడల్పున్న పొడవైన కంటైనర్లను వెర్టికల్ పద్ధతిలో సెట్ చేస్తారు. ప్రత్యేకమైన ఈ కంటైనర్‌పై భాగం తెరిచి ఉంటుంది. దీంట్లో పసుపు పండిస్తారు. 

పసుపు వెర్టికల్ ఫార్మింగ్ కోసం 10-10 సెంటీమీటర్ల దూరంలో బాక్స్ అటూ ఇటూ అమర్చుతారు. మట్టి ఉన్న కంటైనర్లలో పసుపు గింజల్ని రెండు వరుసల్లో నాటుతారు. కొన్నిరోజుల తరువాత పసుపు మొక్క మొలకెత్తుతుంది. ఇది నేరుగా పైకి ఎదుగుతుంది. మొక్క పెరగడంతో ఆకులు సైడ్స్‌లో వస్తుంటాయి. పసుపు పంటకు వెర్టికల్ ఫార్మింగ్ అద్భుతమైన విధానం.

ఉదాహరణకు ఏడాదిలో మీరు 250 టన్నుల పసుపు పంట వస్తే..మీరు 2.5 కోట్లు సంపాదించవచ్చు. ఇందులో 70-8- శాతం ఖర్చులైపోయినా..1.5 నుంచి 1.75 కోట్ల వరకూ సంపాదించవచ్చు. ఆ తరువాత పసుపు పౌడర్ చేసి కూడా అమ్ముకోవచ్చు.

Also read: OPPO 50 Inch Smart TV: ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. ధర కేవలం 15 వేల రూపాయలే! అద్భుత ఫీచర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News