పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'పింక్'. హిందీలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , తాప్సీ పన్ను నటించిన చిత్రం 'పింక్'. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనిలో నటించేందుకు ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఐతే రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 21 రోజులే డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. దీంతో శరవేగంగా సినిమా నిర్మాణం పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నేటి (సోమవారం) నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'పింక్' సినిమాను రీమేక్ చేసేందుకు తెలుగు నేటివిటీకీ తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీ 'పింక్' సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181235","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పవన్ సరసన పూజా హెగ్డే..?
మరోవైపు పవన్ సరసన ఓ కథానాయిక ఉండే విధంగా కథలో మార్పులు చేశారు. ఐతే  ఆ కథానాయిక ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఛాన్స్ పూజా హెగ్డేకు దక్కుతుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా హిట్లతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం అల వైకుంఠపురములో.. సూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకే పవన్ సరసన కథానాయికగా అవకాశం లభిస్తుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఐతే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 


Read Also: జీ సినిమా అవార్డులు.. ఉత్తమ నటుడు చిరంజీవి, ఉత్తమ నటి సమంత
వేసవికి విడుదల..?
మొత్తంగా పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానుల కల కొద్ది రోజుల్లోనే నెరవేరనుంది. సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని వేసవి సెలవులకు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..