ప్రభాస్ ( Prabhas ) ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని స్టార్‌గా అవతరించాడు. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ 20వ చిత్రం టైటిల్ గురించి ఫిల్మ్ నగర్ (Tollywood ) లో తెగ చర్చలు జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొంత కాలం క్రితం జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ సేఫ్‌గా స్వదేశానికి తిరిగి వచ్చింది. తరువాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ 20వ సినిమా ( Prabhas 20 ) ఫస్ట్ లుక్ అయినా వస్తుందేమో అని వేచి చూశారు. దాంతో ఫ్యాన్స్ మీరు అప్‌డేట్ ఇవ్వకపోతే ఇవ్వకపోలేదు... కనీసం మేము  చెప్పిన టైటిల్ అన్నా పెట్టండి అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలు పెట్టారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకోసం ఫ్యాన్స్ అంతా కలిసి రాధేశ్యామ్ అనే టైటిల్ ఫిక్స్ చేయమని ప్రచారం చేశారు. అదే సమయంలో బాలీవుడ్ క్రిటిక్ శివ సత్యం కూడా ప్రభాస్ 20వ చిత్రానికి ఫ్యాన్స్ చెప్పిన విధంగానే రాధేశ్యామ్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ట్వీట్ చేశాడు. దీంతో మేకర్స్ కూడా అదే పేరును ఫైనల్ చేసి త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.