Prabhas's Adipursh Teaser Poster: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిని పోలిన పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన పేరు ‘రాఘవ’ అనే మరో ప్రచారం జరుగుతోంది. అయితే రామాయణాన్ని మరోసారి తెర మీద అద్భుతంగా సృష్టిస్తున్నారా? లేక రామాయణ ఇతిహాసాన్ని నేటి ఆధునిక సమాజానికి తగినట్లుగా రూపొందిస్తున్నారా అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందీలో తానాజీ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన ఓం రౌత్ దర్శకత్వంలో టి సిరీస్ భారీ నిర్మాణంలో ఆది పురుష్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో  కృతి సనన్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరుకాక సన్నీ సింగ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ 2023 వ తేదీ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.


భారీ నిర్మాణంతో రూపొందించిన సినిమా కావడంతో పాటు ప్రభాస్ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 2వ తేదీన టీజర్ విడుదల చేస్తామని సినిమా యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రాముడు జన్మస్థలమైన అయోధ్యలో సరయు నది ఒడ్డున టీజర్ రిలీజ్ కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


ఈ కార్యక్రమంలో ప్రభాస్ సహా పలువురు యూనిట్ సభ్యులు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆ తరువాత ఢిల్లీలో జరగనున్న లవకుశ రామ్ లీలా మైదానంలోని రావణ దహనం కార్యక్రమానికి కూడా ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక టీజర్ రిలీజ్ కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ముందుగా ఉదయం ఏడు గంటల 11 నిమిషాలకు టీజర్ పోస్టర్ విడుదల చేస్తామని చెప్పిన సినిమా యూనిట్ అదే సమయానికి టీజర్ పోస్టర్ విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీన టీజర్ విడుదల చేస్తామని రాత్రి 7.11 నిమిషాలకు ఈ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు.  టీజర్ పోస్టర్  అయితే ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.



Also Read: Ponniyin Selvan Twitter Review: పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలినా.. తెలుగులో మెగా సర్ప్రయిజ్.. సినిమా చూసిన వాళ్లు ఏమంటున్నారంటే?


Also Read: Prabhas Fans Vs Mega Fans: బాధలో ఉండగా ఇదేం పంచాయితీ? ప్రభాస్-చిరంజీవిలకి పోలిక ఎందుకు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook