Prashanth Neel Gives Update on NTR 31 Movie: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అనూహ్యంగా ఈ సినిమా తర్వాత చేసే ప్రశాంత్ నీల్ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఆ అప్డేట్ ఇచ్చింది స్వయంగా ప్రశాంత్ నీల్. తాజాగా ప్రశాంత్ నీల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనతో ముచ్చటించిన మీడియాతో ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ తో సినిమా గురించి చెప్పమని ప్రశాంత్ నీల్ ను అడిగితే ఏం చెప్పాలి? కథ చెప్పాలా ఏంటి? అంటూ ఆయన కౌంటర్ వేశారు.


ఆ తర్వాత సినిమా గురించి ఏదో ఒకటి చెప్పమంటే ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరగకపోయినా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా షూటింగ్ అయిన తర్వాతే ప్రశాంత్ నీల్ సినిమాలో భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆచార్య సినిమా రిజల్ట్ నేపథ్యంలో కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కథ మీద మరిన్ని కసరత్తులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


Also Read: Tollywood: 75వ స్వాతంత్ర దినోత్సవం సంధర్భంగా టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు


Also Read: Prabhas Salaar Movie Update: సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వచ్చే ఏడాదిలో ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి