ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తలపై వైన్ గ్లాస్ పగులగొట్టుకున్నారు. అదేంటీ.. అని అడిగితే నాకు ఇదంతా మామూలే అని చెప్పింది. ఆ వీడియోను కూడా షేర్ చేసి.. ఇలాంటివి ఇళ్లలో చేయవద్దని చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అగ్రనటిగా వెలుగొందుతూ ఉంది. హాలీవుడ్ లో కూడా నటించి మెప్పించింది. నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ గా, అస్సాం టూరిజం క్యాలెండర్ పై అర్థనగ్నంగా దర్శనం ఇవ్వడం ఈ నటికి లేనిపోనీ చిక్కులు తెచ్చిపెట్టాయి.


ఎవరికైనా చికాకు, ఒత్తిడి వస్తే మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి మ్యూజికో లేదా ఏదైనా పనులతోనో డైవర్ట్ చేసుకుంటుంటారు. కానీ ప్రియాంక 'బ్యాడ్ డే' కారణంగా వైన్ గ్లాస్‌తో తలపై కొట్టుకుంది. 'ఉదయం 9 నుండి వైన్ టైం వరకు వర్క్ చేస్తే ఇలానే జరుగుతుంది. మీరు మాత్రం ఇంట్లో ఇలాంటివి ప్రయత్నించకండి. అప్పుడప్పుడూ నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాను అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. ప్రియాంక వీడియోను చూసిన అభిమానులు నోరెళ్లబెట్టేశారు. ప్రస్తుతం హాలీవుడ్‌లో క్వాంటికో 3 సీరియల్‌తో పాటు 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్', ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే హాలీవుడ్ చిత్రాలలో ప్రియాంక నటిస్తోంది.