Puri Jagannadh Great Words About Vijay Devarakonda: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టడంతో తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరి దృష్టి ఆయన మీదే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన లైగర్ అనే ఒక కిక్ బాక్సింగ్ కు సంబంధించిన కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించగా పూరి కనెక్షన్ బ్యానర్ మీద చార్మి కౌర్, పూరి జగన్నాథ్ అలాగే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ దేశవ్యాప్తంగా పలు సిటీలలో టూర్లు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా వరంగల్ లో నిర్వహించిన లైగర్ ఫ్యాన్ డం మీట్ లో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భార్య లావణ్య చెప్పడం వల్ల అర్జున్ రెడ్డి సినిమా చూశానని సినిమా సగం చూసిన వెంటనే విజయ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని పేర్కొన్నారు.


ఈ సినిమా ఇంత గ్రాండ్గా తెరకెక్కడానికి కరణ్ జోహార్ ముఖ్య పాత్ర పోషించారని ఆయనకు ముందు థాంక్స్ చెప్పాలని అన్నారు. అపూర్వ మెహతా ధర్మ ప్రొడక్షన్స్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు చెప్పిన ఆయన అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత విజయ్ నటన మీద, నిజాయితీతో కూడిన అతని నటన మీద తన దృష్టి పడింది అని చెప్పుకొచ్చారు. ఇక లైగర్ సినిమాలో ఏ సీన్ చూసినా విజయ్ నటనలో పొగరు కనిపించదు, కేవలం నిజాయితీ మాత్రమే కనిపిస్తుందని పూరీ చెప్పుకొచ్చారు.


విజయ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని పేర్కొన్న పూరీ జగన్నాథ్ ఒక నిర్మాతగా తాను విజయ్ దేవరకొండకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పంపిస్తే నాకు అప్పులు ఉన్నాయని తెలుసుకుని ముందు ఈ డబ్బుతో మీరు అప్పులు తీర్చుకోండి అంటూ ఆ డబ్బు వెనక్కి పంపించాడని అంత మంచోడు అని పూరీ చెప్పుకొచ్చారు. ఇక అంతేకాక సినిమా జరుగుతున్నన్ని రోజులు నాకు ఎంతో సపోర్టుగా నిలిచాడని, నన్ను ఒక తండ్రిలా భావించి చూసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఇలాంటి నటుడుని తాను ఎక్కడా చూడలేదని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.


Also Read: Allu Vs Mega: పాన్ ఇండియా టాలీవుడ్ స్టార్ ఫ్యాన్స్ చిల్లర పంచాయతీ..#ThammudiGhantaPhalAAm పేరుతో ఛండాలం!


Also Read: Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. షూట్ అప్పుడే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి