టాలీవుడ్‌లో చెరగని రికార్డులు తన పేరిటి లిఖించుకున్న సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ ఒకటి. దాదాపు దశాబ్ధం కిందట వచ్చిన ఈ సినిమా అత్యధిక సెంటర్లలో వంద రోజులు ప్రదర్శితమై సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత మహేష్, పూరీ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు.  మాజీ ఎమ్యెల్యే ఇంట్లో కరోనా కలకలం.. అందరికీ పాజిటివ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు అభిమానులు సైతం పూరీ జగన్నాథ్ పలు సందర్భాలలో తమ హీరోతో మరో హిట్ మూవీ ఎప్పుడు తీస్తారంటూ అడిగేవారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ కావడం తెలిసిందే. మహేష్.. మహేష్ అని మీరెప్పుడు అంటుంటారు.. కానీ నా కష్టకాలంలో మహేష్ బాబు నాతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా లేడని. హిట్ మూవీలు వస్తున్న సందర్భంలోనే మహేష్ సిద్ధంగా ఉంటాడని తన మనసులో మాటను చెప్పాడు. మహేష్ సై అంటే సినిమా తీసేందుకు తానేప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశాడు. LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్


తాజాగా ఓ అభిమాని ప్రశ్నకు బదులిస్తూ మహేష్ బాబు తన మనసులో మాటను బయటపెట్టాడు. పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడం తనకు ఇష్టమేనన్నాడు. తన అభిమాన సినీ దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరని మహేష్ బాబు స్పందించాడు. పూరీ జగన్నాథ్ తన వద్దకు వచ్చి కథ ఎప్పుడు చెబుతాడా అని ఎదురుచూస్తానని సూపర్ స్టార్ తన మనసులో మాటను వెల్లడించాడు. త్వరలోనే టాలీవుడ్‌లో మరో బ్లాక్ బాస్టర్ రెడీ కాబోతుందంటూ పూరీ, మహేష్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి