Radha Madhavam: ప్రతి గ్రామీణ లవ్ స్టోరీలో ఓ సహజత్వం ఉంటుంది. అలాంటి సహజత్వం ఉట్టిపడేలా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో "రాధా మాధవం" అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ ప్రేమ కథలకు ఆడియన్స్ నుంచి మద్దతు లభిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ మంచి స్టోరీ కలిగిన గ్రామీణ ప్రేమ కథ చిత్రం రాబోతోంది. ఈ కథకు వినాయక దేశ హీరోగా అపర్ణాదేవి హీరోయిన్ గా నటించబోతున్నారు. రాధా మాధవం అందమైన చిత్రాన్ని గోపాల్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వసంత్ వెంకట్ బాల కథ మాటలు పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ ప్రక్రియను ముగించుకున్న ఈ చిత్ర యూనిట్.. ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, పోస్టర్ను డిపిఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ D.S.N రాజు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 



దీంతోపాటు బిగ్ బాస్ సోహెల్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన "నేల మీద నేను ఉన్న" అనే పాటను విడుదల చేయగా.. ఈ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో పాట చిత్ర బృందం విడుదల చేసింది. "నువ్వు నేను" అనే లిరిక్స్‌తో ప్రారంభమైన ఈ పాటను వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్ తో పాటు రవి. జీ ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన సంగీతం ఈ పాటకు ప్లస్ పాయింట్ అయింది. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


అతి త్వరలోనే మరింత ఇన్ఫర్మేషన్, అప్డేట్లతో చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి నెలలోని మొదటి వారం లేదా రెండో వారం ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం యోచిస్తోంది. 


ఈ "రాధా మాధవం" సినిమాకి గోనాల్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వసంత్ వెంకట్ బాలా కథ పాటలు మాటలు అందించారు. ఇక సంగీతం దర్శకుడిగా చైతు కొల్లి వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు కెమెరామెన్ గా తాజ్ డిజికే, ఎడిటర్ గా కె రమేష్, ఫైట్స్..రాబిన్ సుబ్బులు వ్యవహరిస్తున్నారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి