Purushothamudu Movie: మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ.. `పురుషోత్తముడు` టీజర్ లాంచ్‌లో రాజ్ తరుణ్
Purushothamudu Movie Teaser: రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పురుషోత్తముడు. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
Purushothamudu Movie Teaser: రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "మా మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా, గెస్టులకు థ్యాంక్స్. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్ డా.రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి." అని కోరారు.
నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ.. "పురుషోత్తముడు సినిమా టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్రానికి ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్‌లో కలుద్దాం.." అని అన్నారు. యాక్టర్ రచ్చ రవి మాట్లాడుతూ.. "మంచి కథా కథనాలతో, ప్యాడింగ్ ఆర్టిస్టులతో పురుషోత్తముడు సినిమా మీ ముందుకు రాబోతోంది. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్లు. వాళ్లకు సంచుల నిండా డబ్బులు ఈ సినిమాతో మిగలాలని కోరుకుంటున్నా. రాముడు, భీముడు కలిస్తే ఎలా ఉంటాడో అలాగే మా డైరెక్టర్ రామ్ భీమన ఉంటారు. సెట్‌లో ఎవరినీ కష్టపెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. చాక్లెట్ బాయ్ రాజ్ తరుణ్‌కు పురుషోత్తముడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా.." అని అన్నారు.
నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "పురుషోత్తముడు మంచి విందు భోజనం లాంటి సినిమా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం లాంటి పెద్ద నటీనటులతో మాలాంటి వాళ్లు కలిసి నటించే అవకాశం ఈ సినిమా కల్పించింది. మనసున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వారికి, హీరో రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు బిగ్ సక్సెస్ ఇవ్వాలి.." అని కోరుకున్నారు. సీనియర్ నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. "డైరెక్టర్ రామ్ భీమన గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ చాలా కూల్‌గా ఉండేవారు. మార్నింగ్ ఎలా ఉండేవారు సాయంత్రం వరకు అదే ఎనర్జీతో వర్క్ చేశారు. చాలా పెద్ద ప్యాడింగ్ ఈ మూవీలో ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.." అని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ.. "ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ మాలాంటి అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను చాలా ఇబ్బందిపెట్టింది. రెండు సినిమాలు చేసి మూడో సినిమా పెద్ద కాన్వాస్‌లో డిజైన్ చేసుకున్నప్పుడు పాండమిక్ వచ్చి మొత్తం మార్చేసింది. అలాంటి టైమ్‌లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్ తో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అడిగిన పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు. గోపీసుందర్, పీజీ విందా, మార్తాండ్ కె వెంకటేష్ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్ కు యాడ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్ తరుణ్ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్ అయ్యా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్‌తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ కంటే సెట్ లో రాజ్ తరణ్ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్ తరుణ్ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసే చిత్రమిది. మీకు ప్రామిస్ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమాను చూడబోతున్నారు." అని అన్నారు.
Also Read: Theatres Closed: థియేటర్లు బంద్.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter