రజినీకాంత్.. సగటు ప్రేక్షకులు సూపర్ స్టార్ అంటారు... అభిమానులు తలైవా అని పిలుచుకుంటారు. ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా... భారత సినిమాకు సంబంధించి ఆయన పరిచయం అక్కరలేని వ్యక్తి. అవును.. తమిళ సినిమా నుంచి నటుడిగా మొదలైన ఆయన.. ఇంతింతై వటుండితై అన్నట్లు భారత సినీ పరిశ్రమ గర్వించే స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయంగానూ పేరు ప్రతిష్టలు, అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనే.. సూపర్ స్టార్ రజనీకాంత్... నేడు ఆయన పుట్టిన రోజు. నేటితో ఆయన 69వ పడిలోకి అడుగుపెడుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ నేపథ్యం..
రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఆయన.. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కర్ణాటకకు మకాం మార్చారు. 1973లో బెంగళూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో కండక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. నటనపై ఉన్న ఆసక్తి, స్నేహితుల ప్రోత్సాహం  కారణంగా ఆయన ఆ తర్వాత మద్రాసుకు పయనమయ్యారు. కండక్టర్‌గా పని చేసే రోజుల్లోనే నాటి శివాజీ రావ్ గైక్వాడ్ టికెట్లు ఇచ్చే విధానం... ప్రయాణీకులను ఆకట్టుకునేది. ఆయన తన స్టైల్‌తో తోటి ఉద్యోగులకు వినోదం పంచేవారు. దీంతో ఆయన్ను నటన దిశగా వారు ప్రోత్సహించారు. ఆ తర్వాత మద్రాస్ రైలెక్కిన  గైక్వాడ్... అక్కడి మద్రాస్ ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో చేరారు. యాక్టింగ్ డిప్లొమా చేసిన తర్వాత దర్శకుడు కె. బాలచందర్‌తో పరిచయం ఏర్పడింది. బాల చందర్ సినిమా 'అపూర్వ రాగంగళ్'తో తొలిసారిగా తమిళ తెరపై కనిపించారు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా ఆయన పేరు  తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏనాడూ ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు...


రజనీ అంటే స్టైల్.. స్టైల్ అంటే రజనీ...
సినిమాల్లో తన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆరు పదుల వయసులోనూ సినీ ప్రేక్షకులకు తన నటనలో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు. రజనీకాంత్... ఎన్నో సూపర్ హిట్ సినిమాలను భారతీయ ప్రేక్షకులకు అందించారు. సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. దశాబ్దాల సినీ జీవితంలో .. ఆయన కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందంటే ఆతిశయోక్తి కాదు.


[[{"fid":"180558","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ స్టోరీ","field_file_image_title_text[und][0][value]":"Rajinikanth birthday special story"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ స్టోరీ","field_file_image_title_text[und][0][value]":"Rajinikanth birthday special story"}},"link_text":false,"attributes":{"alt":"రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ స్టోరీ","title":"Rajinikanth birthday special story","class":"media-element file-default","data-delta":"1"}}]]


కొత్త వారికి ప్రోత్సాహం..
ప్రస్తుతం ఆయన కొత్త నిర్మాతలకు, దర్శకులకు అవకాశం కల్పిస్తున్నారు. తన పుట్టిన రోజు కంటే ఒక రోజు ముందుగానే తన తదుపరి చిత్రం 'తలైవర్ 168' సినిమాకు శ్రీకారం చుట్టారు రజనీకాంత్. చెన్నైలో దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తలైవా పుట్టిన రోజు నాటి నుంచే రెగ్యులర్ షూటింగ్ చేయాలని 'తలైవర్ 168' చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా... శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మీనా, కుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రంలో ప్రకాశ్ రాజ్ విలన్‌గా నటిస్తున్నారు. మరోవైపు రజనీ నటించిన దర్బార్ మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.      


రాజకీయాల్లో రజనీ..
సినీరంగం నుంచి ఎందరో స్టార్లు.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే పంథాలో రజనీకాంత్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లోను రజనీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయ రంగంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని తలైవా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేసేందుకు ఆయన...  రజనీ మక్కల్ మండ్రం అనే ఫ్యాన్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ ఫ్యాన్ క్లబ్ ద్వారా అభిమానులను కలుస్తూనే ఉన్నారు. తమిళనాడులో ఆయన దిశానిర్దేశం చేసిన పార్టీ గెలుస్తుందనే ప్రచారం కూడా ఉందంటే.. ఆయన తమిళ రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తారో అర్థం చేసుకోవచ్చు.  


అధ్యాత్మిక జగతిలో తలైవా...  
సూపర్ స్టార్‌గా ఎదిగినప్పటికీ.. ఆయనలో గర్వం ఏ మాత్రం లేదంటే అతిశయోక్తి కాదు.. అంతేకాదు.. ఆయనకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. ఓవైపు సూపర్ స్టార్ హోదా అనుభవిస్తున్న ఆయన... మరోవైపు తనకున్న స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి ప్రతీ ఏటా హిమాలయాలకు వెళ్లి కొద్ది రోజులు సాధారణ జీవితం గడిపివస్తారు. తన సినిమాల ద్వారా నిర్మాతలకు నష్టం వచ్చిన సందర్భాల్లో వారిని ఏదో ఒక విధంగా తిరిగి ఆదుకోవడం ద్వారా రజనీకాంత్ తన గొప్ప మనసును చాటుకున్నారు. నష్టపోయిన నిర్మాతలను ఏదో విధంగా సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అభిమానులు రజనీకాంత్‌ను ఎంతలా ప్రేమిస్తారో... అంతే సమానంగా రజినీకాంత్ సైతం వారిపై అభిమానాన్ని చాటుకున్న సందర్భాలు అనేకం. ఎంత మంది అభిమానులు వచ్చినా విసుగు చెందకుండా.. అందరినీ  కలిసి వారితో ఓ ఫోటోతో ఫోజిచ్చే రజినీకాంత్ గొప్పతనం ఎందరో ఇతర సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదీ ఆయనలోని మంచి వ్యక్తిత్వానికి, హుందాతనానికి అద్దం పడుతుంది.


[[{"fid":"180559","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తనని కలిసేందుకు వచ్చిన దివ్యాంగుడైన ఓ అభిమానితో ఫోటోకు ఫోజిస్తున్న రజినీకాంత్","field_file_image_title_text[und][0][value]":"Rajinikanth`s pose with a fan"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"తనని కలిసేందుకు వచ్చిన దివ్యాంగుడైన ఓ అభిమానితో ఫోటోకు ఫోజిస్తున్న రజినీకాంత్","field_file_image_title_text[und][0][value]":"Rajinikanth`s pose with a fan"}},"link_text":false,"attributes":{"alt":"తనని కలిసేందుకు వచ్చిన దివ్యాంగుడైన ఓ అభిమానితో ఫోటోకు ఫోజిస్తున్న రజినీకాంత్","title":"Rajinikanth`s pose with a fan","class":"media-element file-default","data-delta":"2"}}]]


స్టార్.. స్టార్.. సూపర్ స్టార్..  
రజనీకాంత్ గురించి చెప్పుకోవాలంటే... ఎన్నో విశేషాలు చెప్పుకోవచ్చు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా కబాలి సినిమా విడుదల సమయంలో ఆ సినిమా పోస్టర్లను విమానాలపై ప్రదర్శించారంటే... ఆయనకున్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కబాలి సినిమాను చూసేందుకు ఏకంగా ప్రత్యేక విమానంలో అభిమానులు చెన్నైకి చేరుకున్నారంటే.. ఆయన పట్ల అభిమానులకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ రజనీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది ఇప్పటికీ.. ఆయన్ను కలిసేందుకు ప్రత్యేకంగా చెన్నైకి వస్తారు. 


తలైవా పుట్టిన రోజు.. అభిమానులకు పండుగ రోజు...  
తలైవా పుట్టిన రోజంటే.. అభిమానులకు పండుగ రోజు. ఈ రోజు అభిమానులు తమ ఆరాధ్య నటుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి సంబరాలను అంబరాన్నంటిస్తున్నారు. మరోవైపు చెన్నై అంతటా.. పండగవాతావరణం కనిపిస్తోంది. సూపర్ స్టార్ నటించిన బాషా సినిమాను చెన్నైలోని అన్ని థియేటర్లలోనూ ప్రత్యేక షోగా వేస్తున్నారంటే... ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా... భారత సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఆయన ఇలాగే ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నారు. జీ హిందుస్థాన్ తరఫు నుంచి కూడా హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ తలైవా.