సూపర్ స్టార్ రజినీకాంత్ పెళ్లి రోజు నేడు. ఆయన లతాను 1981 ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగింది.  వారిద్దరి వివాహ బంధానికి నేటితో 39 ఏళ్లు పూర్తయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ సందర్భంగా తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెప్పిన కూతురు సౌందర్య రజినీకాంత్ .. అలనాటి వారిద్దరి పెళ్లి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. లవ్.. లవ్.. లవ్.. అమ్మా, నాన్న పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ .. ఈ ఫోటోకు వేల కొద్దీ లైక్ లు కొడుతున్నారు. తలైవర్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ విష్ చేస్తున్నారు.



జీ హిందుస్తాన్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు.. .