ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమ చూపులన్నీ 2.0 సినిమాపైనే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్.అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రజినీకాంత్ స్పీచ్ విన్న తరవాత 2.0 పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన రజినీకాంత్ “ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గ్యారంటీ. కావాలంటే రాసుకోండి. నిర్మాత సుభాస్కరన్ ఈ  సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేశారు. అదేదో నాకోసమో, అక్షయ్ కుమార్ కోసమో కాదు. 2.0 కోసం. దర్శకుడు శంకర్ విజన్‌ని నిజం చేయడం కోసం…” అని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘2.0 సినిమా థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్ టైనరే కాదు, ఈ  సినిమాలో ఇంటర్నేషనల్ మెసేజ్ కూడా ఉంటుందని చెప్పిన రజినీకాంత్, ఈ ప్లానెట్ జస్ట్ మనుషుల కోసమే కాదు,  ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ఈ ప్లానెట్ పై బ్రతికే హక్కు ఉంది’ అని తెలిపారు సూపర్ స్టార్. నవంబర్ 29 తేదిన  గ్రాండ్‌గా రిలీజవుతుంది 2.0 సినిమా. ఎమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. శంకర్ డైరెక్షన్‌లో  లైకా ప్రొడక్షన్స్  బ్యానర్  పై  2.0 సినిమా తెరకెక్కింది.


రజనీకాంత్ నటించిన "రోబో 2.0" చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్‌లో రోబో చిట్టి బ్యాంగ్‌ను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనితీరుగానీ, గ్రాఫిక్స్ గానీ ప్రేక్షకులను మైమరిపించేలా ఉన్నాయని ఇప్పటికే నెటిజన్లు  సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్ని రికార్డులను తుడిచిపెట్టడానికే ఈ సినిమా వస్తుందని ఇప్పటికే రజనీ అభిమానులు కొందరు జోస్యం కూడా చెబుతున్నారు.4డీ సౌండ్ టెక్నాలజీతో ఈ సినిమా  రూపుదిద్దుకుంది. భారతదేశంలో తొలిసారిగా ఈ టెక్నాలజీతో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. హిందీలో  ధర్మా ప్రొడక్షన్స్ ఈ చిత్ర డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకుంది.