Raju Srivastava: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ గుండెపోటు బారిన పడ్డాడు. ఢిల్లీలోని ఓ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా.. గుండెపోటు గురైనట్లు సమాచారం. దీంతో జిమ్‌లో ట్రైనర్స్ శ్రీ వాస్తవాను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని హాస్పిటల్ అధికారులు వెల్లడించారు. తక్కువ సమయంలోనే  స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీ వాస్తవ గుండెపోటు బారిన పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కోవాలని నెట్టింట్లో పోస్ట్లు పెడుతున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమెడియన్ రాజు శ్రీ వాస్తవ 25 డిసెంబర్ 1963న ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లో జన్మించారు.  అయితే  బాలీవుడ్‌లో అడుగు పెట్టక ముందు శ్రీ వాస్తవని సత్య ప్రకాష్‌గా పిలిచేవారు. బాలీవుడ్‌లో తనదైన పేరు సంపాదించుకున్న తర్వాత పేరు మార్చుకున్నారని సమాచారం. అయితే వాస్తవాకి చిన్న తనం నుంచే కామెడీ అంటే చాలా ఇష్టం. అందుకే సినీ కామెడీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మొదట 'టీ టైమ్ మనోరంజన్' అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించారు కమెడియన్ రాజు శ్రీ వాస్తవ. అంతేకాకుండా శ్రీవాస్తవా సీనియర్‌ నటులైన సురేష్ మీనన్, బ్రజేష్ హర్జీ వంటి వారితో కూడా వేదిక పంచుకోవడం విశేషం. బాలీవుడ్‌ గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'నని పలు టీవి షోల్లో తెలిపారు.


బతుకుదెరువు కోసం రిక్షా కూడా నడిపిన రాజు శ్రీ వాస్తవ:


కమెడియన్ కావాలనే కలతో ముంబైకి వచ్చిన రాజు ఎన్నో కష్టాలు పడ్డారు. తన సొంత ఖర్చుల కోసం ఆటో కూడా నడిపారు. ఒక ప్రయాణికుడి పరిచయంతో ఆయన ఈ స్థాయికి ఎదిగారని తెలిపారు. రాజు ఇటీవల బిగ్ బాస్‌ షో‌లో కూడా భాగమయ్యాడు. షోలో విజయం సాధించలేకపోయిన ప్రేక్షకులను తన కమెడితో బాగా అలరించారు. అంతే కాకుండా ఆయన రాజకీయా ప్రవేశం కూడా చేశారు.


Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!


Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook