Ram Charan Upasana : మొన్న దుబాయ్.. నేడు మాల్దీవులు.. విహరిస్తోన్న రామ్ చరణ్ ఉపాసన.. పిక్స్ వైరల్

Ram Charan And Upasana Konidela Vacation రామ్ చరణ్ ఉపాసనలు ఇప్పుడు పర్సనల్ స్పేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన సినిమా షూటింగ్‌కు గ్యాప్ దొరకడంతో ఇలా భార్యను కోరిన చోటకు తిప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.
Ram Charan And Upasana At Maldives రామ్ చరణ్ ఉపాసనలు ఇప్పుడు సంబరంలో మునిగిపోయారు. త్వరలోనే వారసుడు రాబోతోన్నాడని మెగా జంట ఆనందపడుతోంది. అయితే కడుపుతో ఉన్న భార్య కోరికలను తీర్చాలని ఏ భర్త అయినా అనుకుంటాడు. అందుకే ఇప్పుడు ఉపాసనను దేశాటనకు తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. దుబాయ్‌లో ఉపాసన సీమంతం వేడుకలను జరిపించిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ మాల్దీవులకు వెకేషన్ కోసం తీసుకెళ్లాడు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ వద్ద చెర్రీ, ఉపాసన ఇలా స్టైలీష్‌గా కనిపించారు.
గర్భంతో ఉన్నవారికి చాలా కోరికలు ఉంటాయని, అక్కడికి వెళ్లాలి.. ఇక్కడకు వెళ్లాలి.. అవి తినాలి.. ఇవి తినాలి అనుకుంటారట. అలా వారి కోరికలు తీర్చుతూ ఉంటే లోపల ఉన్న బిడ్డ కూడా ఎంతో సంతోషంగా ఉంటాడని చెబుతుంటారు. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ తన సతీమణి కోరికల చిట్టాను తీర్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మొన్న దుబాయ్‌లో గ్రాండ్‌గా సీమంతం జరిపించాడు రామ్ చరణ్. అందులో రామ్ చరణ్, ఉపాసన వైట్ అండ్ వైట్ డ్రెస్సులో కనిపించి మెప్పించారు. మోస్ట్ రొమాంటిక్ జోడిగా నెటిజన్లు కామెంట్లు చేశారు. దుబాయ్ వెకేషన్‌కు సంబంధించిన వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ జోడి మాల్దీవులకు పయనమైంది.
ఈ మేరకు ఎయిర్ పోర్ట్ వద్ద రామ్ చరణ్, ఉపాసనలు ఇలా దర్శం ఇచ్చారు. ఎంతో స్టైలీష్‌గా ఈ జోడి ఎయిర్ పోర్ట్ వద్ద కనిపించింది. అయితే శంకర్ కూడా తన ఇండియన్ 2 సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను తైవాన్‌లో కంప్లీట్ చేసుకున్నాడు. తిరిగి వచ్చాక మళ్లీ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా అవుతాడని తెలుస్తోంది. అంతలోపు రామ్ చరణ్ కూడా తిరిగి వస్తాడని సమాచారం.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌కు ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దించాలని దిల్ రాజు గట్టిగా ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook