రాంచరణ్ ఇటీవల కాలంలో మెచ్చిన సినిమా, ఆయనకు బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా ? అది తెలియాలంటే ముందుగా ఆయన చేసిన లేటెస్ట్ ట్వీట్ ఏంటో చూడాలి. ఎందుకంటే అక్కడే చెర్రీ ఈ వివరాలు వెల్లడించాడు. అవును, ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ( Uma Maheswara Ugraroopasya movie ) చూసిన చరణ్.. ఆ సినిమా తనను ఎంతో కట్టిపడేసిందని ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో నటించిన నటీనటులు సత్యదేవ్, సీనియర్ హీరో నరేష్, సుహాస్, హరిచందన, రూపలను ప్రశంసల్లో ముంచెత్తిన రాంచరణ్ ( Ram Charan ).. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహాను కూడా అభినందించాడు. Also read: Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే


ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీకి అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. c/o కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు రానా దగ్గుబాటి, దర్శకుడు హరీష్ శంకర్, భాస్కరభట్ల లాంటి టాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ సైతం ఈ సినిమా యూనిట్ సభ్యులను పొగడ్తల్లో ముంచెత్తి సినిమాకు మంచి బూస్టింగ్ ఇచ్చాడు. Also read: COVID-19: ఏపీ లేటెస్ట్ కరోనా హెల్త్ బులెటిన్