COVID-19: ఏపీ లేటెస్ట్ కరోనా హెల్త్ బులెటిన్

ఏపీలో ఆధివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 46,999 శాంపిల్స్‌ని ( COVID-tests ) పరీక్షించగా అందులో  7,665 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది.

Last Updated : Aug 10, 2020, 08:02 PM IST
COVID-19: ఏపీ లేటెస్ట్ కరోనా హెల్త్ బులెటిన్

అమరావతి: ఏపీలో ఆధివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 46,999 శాంపిల్స్‌ని ( COVID-tests ) పరీక్షించగా అందులో  7,665 మందికి  కరోనావైరస్ పాజిటివ్‌ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య మొత్తం 2,35,525 మందికి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో 80 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు  కరోనావైరస్తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 2,116 కి చేరింది. Also read :  Coronavirus: కరోనాపై గెలిచిన మరో సీఎం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,773 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. మరో 1,45,636 మంది  కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్క గత 24 గంటల్లోనే 6,924 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో ( AP COVID-19 health bulletin ) వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఏపీలో 25,34,304 కరోనా పరీక్షలు చేశారు. Also read : COVID-19: తెలంగాణ సర్కార్‌పై బీజేపి చీఫ్ జేపీ నడ్డా ఫైర్

Trending News