`బ్యూటీఫుల్` హీరోయిన్‌తో రెచ్చిపోయిన వర్మ
`బ్యూటీఫుల్` ఎ ట్రిబ్యూట్ టు రంగీలా అనే ఉప శీర్షికతో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది.
'బ్యూటీఫుల్' ఎ ట్రిబ్యూట్ టు రంగీలా అనే ఉప శీర్షికతో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రాం గోపాల్ వర్మ హీరోయిన్ తో స్టెప్పులేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో రాం గోపాల్ వర్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
[[{"fid":"180791","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
వోడ్కా విత్ వర్మ..
బ్యూటీఫుల్ ప్రమోషన్ తో బిజీగా ఉన్న రాం గోపాల్ వర్మ .. వోడ్కా విత్ వర్మ పేరిట 'బ్యూటిఫుల్' టీమ్ అందరితో కలిసి ప్రీ న్యూ ఇయర్ పార్టీ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అభిమానులను కూడా పిలిచి ఆశ్చర్యపరిచారు వర్మ. అంతే కాదు .. ప్రీ న్యూ ఇయర్ పార్టీలో వోడ్కా తీసుకుని మరోసారి రెచ్చిపోయారాయన. 'బ్యూటిఫుల్' తో కలిసి స్టెప్పులేశారు. తాజాగా ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ మూడ్ లో ఆర్జీవీ చేసిన పని ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఒక్కసారిగా హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై పడిపోయారు. ఈ అకస్మాత్తు పరిణామంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. హీరోయిన్ నైనా గంగూలీకి కూడా నోట మాట రాలేదు. ఏం జరుగుతుందో తెలియలేదు. హఠాత్పరిణామంతో ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యారు. నిలుచున్నచోటే కూలబడిపోయారు. భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టుకున్నారు.
[[{"fid":"180792","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
జనవరి 1న థియేటర్లలోకి 'బ్యూటిఫుల్'
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ 'బ్యూటిఫుల్' సినిమాకు కథ అందించారు. ఆయన శిష్యుడు ఆగస్త్య మంజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..