నూతన నటీనటులు రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావలి రాజు అనే కొత్త నిర్మాత నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రణస్థలం మూవీ ఫస్ట్ లుక్‌ను  ఆదివారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి  విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను. ప్రొడ్యూసర్ రాజు చిన్న స్టేజ్ నుండి ఈ రోజున సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.


చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ''ఈ సినిమాకి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి ఔట్‌పుట్‌తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. చిత్ర నిర్మాత కావాలి రాజు మాట్లాడుతూ ''మా సినిమా ఫస్ట్ లుక్‌ను మంచి మనసున్న మా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా సబితమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను'' అని అన్నారు. ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా గొప్పగా తెరకెక్కించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు చివరి దశలో ఉంది. వచ్చే నెల మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.