ముంబై: కబీర్ ఖాన్ దర్శకత్వంలో, రిలయన్స్, నడియావాలా ఎంటర్టైన్మెంట్ ల సంయక్త నిర్మాణంలో హీరోగా రణ్వీర్ సింగ్ రూపుదిద్దుకొంటున్న చిత్రం 83. అయితే 1983 క్రికెట్ ప్రపంచకప్ సంగ్రామానికి సంబంధిన నేపథ్యంలో రూపుదిద్దుకొంటున్నఈ చిత్రం మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ ఫైనల్ మ్యాచ్ తో పాటు మొత్తం క్రికెట్ జీవితంలో చేసిన వీరోచిత పోరాట ఫలితమే భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ను సాధించిందనే కథాంశమే ప్రధానంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MP CM రాజీనామా.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందా?


మరోవైపు ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలవుతుందని భావించినప్పటికీ చివరకు అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా భయంకరమైన ఆందోళనలకు గురిచేస్తోన్న నేపథ్యంలో చిత్రం విడుదల నిలిపివేయడమనే నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.    


Also Read: భారత్‌లో అయిదో కరోనా మరణం.. ఈసారి ఎక్కడంటే!


కాగా కరోనా వైరస్ పై  హీరో రణ్వీర్ స్పందిస్తూ ముందుస్తు జాగ్రతలు తీసుకోవాలని, ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని తన అభిమానులకు సూచించారు. ఈ చిత్రం దేశ గౌరవానికి సంబంధిన చిత్రమని అన్నారు. ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే కపిల్ భార్య రోమి పాత్రలో కనిపించనుందని, తాహిర్ రాజ్ భాసిన్, అమ్మి విర్క్, సాహిల్ ఖత్తర్, హార్డీ సంధు, సాకిబ్ సలీంలు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..