Ravikula Raghurama Review and Rating: తెరపై ఎన్ని ప్రేమ కథలు వచ్చినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం ఎప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. అసలు ప్రేమ కథలు లేని చిత్రాలంటూ ఉండవు. తాజాగా పూర్తి ప్రేమ కథా చిత్రంగా రవికుల రఘురామా అనే మూవీ థియేటర్ల అలరించేందుకు సిద్ధమైంది. గౌతమ్ వర్మ, దీప్షికలు జంటగా.. చంద్రశేఖర్ కానూరి తీసిన ఈ సినిమా నేడు (మార్చి 15) ఆడియన్స్ ముందుకు వచ్చింది. శ్రీధర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా..? అందమైన ప్రేమ కథ ఆకట్టుకుందా..? రివ్యూలో చూద్దాం పదండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏంటంటే..?


గౌతమ్ (గౌతమ్ వర్మ) అనే యువకుడు కలియుగ రాముడి టైపులో ఉంటాడు. అలాంటి యువకుడు నిషా (దీప్సికా ఉమాపతి) అనే అమ్మాయిను ప్రేమిస్తాడు. లవ్ అయిన తరువాత బ్రేకప్ కామన్ కదా.. ఈ ప్రేమ కథకు కూడా బ్రేక్ పడుతుంది. గౌతమ్‌కు దూరంగా నిషా వెళ్లిపోతుంది. వీరిద్దరు ఎందుకు విడిపోయారు..? గౌతమ్ నుంచి నిషా ఎందుకు దూరంగా వెళ్లిపోయింది..? ఆ తరువాత గౌతమ్ పరిస్థితి ఏమైంది..? చివరికి వీరిద్దరు ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు..? వంటి విషయాలు తెలియాలంటే రవికుల రఘురామా మూవీ చూడాల్సిందే. 


ఎవరు ఎలా నటించారంటే..?


హీరోహీరోయిన్స్ ఇద్దరు కొత్త వారైనా.. తెరపై ఎలాంటి బెరుకు లేకుండా చక్కగా యాక్ట్ చేశారు. హీరో పాత్రకు గౌతమ్ వర్మ సరిగా సెట్ అయ్యాడు. కలియుగ రాముడిగా అమాయకుడిలా.. మంచి వాడిగా అలరించాడు. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. దీప్సికా తన అందం, యాక్టింగ్‌లో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇతర నటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.


విశ్లేషణ


తొలిసారి మెగా ఫోన్ పట్టినా డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి సరికొత్త పాయింట్‌ను తీసుకున్నారు. ప్రేమకథకు మదర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ టచ్‌తో మెప్పించారు. స్టోరీని తెరపై చక్కగా ఆవిష్కరించారు. హీరో యాంగిల్‌లోనే స్టోరీ రన్ అయినా.. హీరోయిన్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద్వితీయార్థంలో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. స్టోరీ లైన్ తెలిసిందే కావడం.. అక్కడక్కడ స్లో నెరేషన్‌తో కాస్త ఇబ్బంది అనిపించినా.. చక్కటి మ్యూజిక్, సాంగ్స్, ఆర్ఆర్, ఎమోషన్ సీన్స్‌తో ఆడియన్స్‌ హాయిగా అనిపిస్తంది. ఒక మగాడు ప్రేమిస్తే ఊపిరి ఆగే క్షణం వరకు ప్రేమిస్తునే ఉంటాడని హీరోయిన్‌ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది. ఇంకా చాలా డైలాగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. సరికొత్త లోకేషన్స్‌, చక్కటి టేకింగ్‌తో స్టోరీతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.


రేటింగ్: 2.75/5


Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు


Also Read: Oppo A78 Price Cut: అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌ ధరకే కొత్త Oppo A78 మొబైల్‌ను పొందండి.. పరిమితకాల ఆఫర్‌..    



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter