Raviteja Dhamaka Movie to Release on October 21: దసరా సీజన్లో మెగాస్టార్ చిరంజీవి, మన్మధుడు నాగార్జున నటిస్తున్న సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు మంచు విష్ణు నటిస్తున్న జిన్నా సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా తరువాత వచ్చే దీపావళి సీజన్లో ఇప్పటివరకు విడుదలవుతున్నట్లు ఒక్క తెలుగు సినిమా మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఇద్దరు తమిళ హీరోలు ఆల్రెడీ దీపావళి డేట్ ల మీద కన్నేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఇద్దరు కూడా డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన వారే కావడంతో ఈసారి దీపావళి తమిళ వారిదేనా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రవితేజ ధమాకా సినిమా దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉందని వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి ఇప్పటికే కార్తి హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సర్దార్ విడుదలకు సిద్ధమైంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపిస్తుండగా రాశి  ఖన్నా, మలయాళ భామ రజీషా విజయన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.


ఇక కార్తీక్ తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను అక్కినేని నాగార్జున తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమా హక్కులు కొనేసి పెద్ద ఎత్తున తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. డేట్ ప్రకటించలేదు కానీ దీపావళి బహుమతిగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక అలాగే శివ కార్తికేయన్ హీరోగా తెలుగు డైరెక్టర్ అనుదీప్ రూపొందించిన ప్రిన్స్ సినిమా కూడా దీపావళి సందర్భంగా తెలుగులో విడుదలవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రూపొందింది.


తెలుగులో టాప్ ప్రొడ్యూసర్స్ గా ఉన్న సునీల్ నారాయణ, పుష్కర్ రామ్మోహన్రావు, డి సురేష్ బాబు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక వీరికి పోటీగా రవితేజ హీరోగా త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో రూపొందిన ధమాకా సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.


నిజానికి రవితేజ చివరిగా చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ధమాకాతో ఎలా అయినా హిట్ అందుకోవాలని రవితేజ అనేక ఆశలు పెట్టుకున్నాడు. రవితేజ అభిమానులు కూడా ఈ సినిమాతో కచ్చితంగా హిట్టు కొడతామని భావిస్తున్నారు. గతంలో త్రినాథరావు నక్కిన చేసిన అన్ని సినిమాలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కూడా బానే ఉంటుందని రవితేజ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల మీద అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 


Also Read: Trisha Krishnan Pics: బ్లాక్ శారీలో త్రిష.. ఏంజిల్‌లా మెరిసిపోతున్న చెన్నై చిన్నది! ఛానళ్ల తర్వాత


Also Read: Shaakuntalam in December: సమంత 'శాకుంతలం' విడుదలకు రంగం సిద్దం.. ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook