Raviteja Role Leaked from Mega 154: ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా బిజీగా ఉన్నా సరే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక కీలక పాత్ర ఉంది అనగానే ఆయన చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే మెగాస్టార్ హీరోగా నటిస్తున్న 154వ సినిమాలో రవితేజ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయాన్ని మెగాస్టార్ సహా బాబీ కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు,  అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పాత్రలో కనిపించబోతున్నారని అయితే ఆయన సొంత సోదరుడు కాదు గాని సవతి తల్లి కుమారుడిగా కనిపించబోతున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఇద్దరికీ పడదని ఇద్దరి,  మధ్య పోరాట దృశ్యాలు కూడా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే మెగాస్టార్ తో గతంలో చాలా సన్నిహితంగా ఉండే రవితేజ ఇప్పటికీ అలాగే ఉంటూ ఉంటారు.


మెగాస్టార్ తో అన్నయ్య అనే సినిమా చేశారు రవితేజ అందులో సొంత సోదరుడిగా నటించి తన నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ఇప్పుడు మెగాస్టార్ కు వ్యతిరేకంగా ఉన్న సినిమా చేయడం కాస్త కష్టమే అని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి జరిగేదంతా ప్రచారమే కాగా ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. బహుశా సినిమా విడుదలైన తర్వాతే రవితేజ పాత్రకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 


Also Read: Producers Guild Committees: సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు.. దిల్ రాజు సహా ఎవరెవరు ఉన్నారంటే?


Also Read: Ramarao On Duty: ఆసక్తికరంగా రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook