Producers Guild Committees: సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు.. దిల్ రాజు సహా ఎవరెవరు ఉన్నారంటే?

Active Telugu Film Producers Guild Committees: నిర్మాణ వ్యయం పరిమితి లేకుండా పెరిగిపోయిన నేపథ్యంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి కమిటీలను నియమించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2022, 04:44 PM IST
Producers Guild Committees: సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు.. దిల్ రాజు సహా ఎవరెవరు ఉన్నారంటే?

Active Telugu Film Producers Guild Committees: నిర్మాణ వ్యయం పరిమితి లేకుండా పెరిగిపోయిన నేపథ్యంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుండి షూటింగ్‌లను నిలిపివేయాలని మంగళవారం అధికారికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.  అనేక కారణాలతో నిర్మాణ వ్యయం భారీగా పెరగడం వలన నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చలకు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సిద్దమయింది. ఈ క్రమంలోనే తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి గిల్డ్ కమిటీలను నియమించింది.

అందులో భాగంగా థియేట్రికల్, ఎగ్జిబిషన్ సమస్యలపై చర్చించడానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు కన్వీనర్ గా శ్రేష్ట్ మూవీస్ సుధాకర్ రెడ్డి, యూవీ వంశీ, వీరి నాయుడు, బన్నీ వాసు, సాయిబాబా జాగర్లమూడి, రామ్ మోహన్, ఎన్వీ ప్రసాద్ తో ఒక కమిటీ వేశారు. అలాగే ఓటీటీ హోల్డ్ బ్యాక్ అంశాల మీద బాపినీడు కన్వీనర్ గా ఏఎం రత్నం, పి.కిరణ్, మైత్రీ రవి, యూవీ వంశీ, శరత్ మరార్ సభ్యులుగా ఒక కమిటీ వేశారు.

అలాగే ప్రొడక్షన్ కాస్ట్ సమస్యలపై చర్చించేందుకు వివేక్ కూచిభొట్ల కన్వీనర్ గా నాగవంశీ, రవికిశోర్, శివలెంక కృష్ణప్రసాద్, మధు, కిషోర్, రాధామోహన్, 14 రీల్స్ గోపి ఆచంట, బెక్కం వేణు గోపాల్‌, చిట్టూరి శ్రీనివాస్, సుధాకర్ చెరుకూరి, దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, అనురాగ్ పర్వతనేనిలతో ఒక కమిటీ వేశారు. ఇక ఈ కమిటీలన్నీ తమకు అప్పగించిన సమస్యలకు సంబంధించిన సమస్యలపై చర్చించి, సాధ్యమైన మేరకు పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తాయని తాజాగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటన చేసింది. ఈ కమిటీలు తమ నిర్ణయాలు వెలువరించి వాటికి యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు షూటింగ్‌లను నిలిపివేయడానికి గిల్డ్ నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఈ తంతు అంతా పూర్తి అయ్యే సరికి ఎన్ని రోజులు పడుతుంది అనేది. 

Also Read: Producers Guild: ఫలించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ చర్చలు.. వెనక్కి తగ్గుతున్న హీరోలు.. సంచలన నిర్ణయం?

Also Read: Ramarao On Duty: ఆసక్తికరంగా రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News