బాహుబలి తరహా రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ చేస్తోంది సాహో మూవీ. మొన్నటి వరకు షేడ్స్ ఆఫ్ సాహో అంటూ అదరగొట్టింది యూనిట్. చాప్టర్-1, చాప్టర్-2 పేరిట వచ్చిన  వీడియోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
నెటిజన్ల మనసు దోచుకున్న సాహో షేడ్స్...
సోషల్ మీడియాలో మిలియన్లలో వ్యూస్.. లక్షల్లో లైక్స్. ఇప్పుడు అంతకు మించి హంగామా రెడీ అవుతోంది. అవును.. సాహో టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా టీజర్ కు ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.  మరో 3 రోజుల్లో టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
బాహుబలి తరహా భారీ ఎక్సెపెక్టేషన్స్
బాహుబలి లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కారణంగా సాహోపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి . ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూ.250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నారు.