తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని నటి రేణు దేశాయ్ తెలిపింది. తనకు కాబోయే భర్త చాలా మంచి వ్యక్తి అని తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. 'పవన్ కళ్యాణ్ నన్ను విడాకులు అడిగారు. ఆయనకు మళ్లీ పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవన్ ఫ్యాన్స్‌కు నేను వదిన ఎలా అవుతాను. ఆయన ప్రస్తుత భార్యే ఫ్యాన్స్‌కు వదిన అవుతుంది. పవన్‌కు డబ్బుపై మమకారం లేదు. మా పిల్లలను బాగా చూసుకుంటారు.' అని ఆమె చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిశ్చితార్థ కార్యక్రమం ఎందుకు రహస్యంగా జరుపుకోవలసి వచ్చింది? అనే ప్రశ్నకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  "క్రితం ఏడాదే నేను మళ్లీ పెళ్లి గురించి ఆలోచించాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనే విషయాన్ని చెబితే చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. 'నిన్ను చంపేస్తాము.. నీ కాబోయే భర్తను చంపేస్తాము' అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలోని కామెంట్స్‌ పట్టించుకోవద్దని చాలామంది చెప్పినా.. నేను పట్టించుకోకుండా ఉండలేకపోయాను. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే.. ఆయన ఎవరనేది గోప్యంగా ఉంచాను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం కాదు. పెళ్లి తరువాత ఆయన ఎవరనేది చెబుతాను' అని రేణు సమాధానమిచ్చారు.