అన్నిచోట్ల బంధుప్రీతి... సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన రేణుదేశాయ్..
సినీ రంగంతో పాటు అన్ని రంగాల్లో నెపోటిజం ఉందని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ తెలిపారు. ప్రతిభ ఉండి ధైర్యంగా నిలబడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆమె స్పష్టం చేశారు.
ముంబై: సినీ రంగంతో పాటు అన్ని రంగాల్లో నెపోటిజం ఉందని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ తెలిపారు. ప్రతిభ ఉండి ధైర్యంగా నిలబడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆమె స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ సున్నిత మనస్కుడు కావడం వల్లనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఎటువంటి వారసత్వం లేకున్నా సుశాంత్ సినిమా రంగంలో తన ప్రతిభతో రాణించి తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగాడని ఆమె అన్నారు.
Also Read: Be careful with fake mails అంటోన్న SBI..
ఇదిలాఉండగా సినీ రంగంలో ఎన్నో రకాల ఒత్తిడిలు ఉంటాయని ఎప్పటికప్పుడు తమకు తాము పాజిటివ్ గా మార్చుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. అయితే సుశాంత్ తన ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకోలేక నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. సినిమా రంగంలో రాణించాలంటే ఫ్యామిలీ బ్యా గ్రౌండ్, ప్రతిభను నమ్ముకుని రావడం కాదని, అందుకు మనోధైర్యంతో ముందుకు సాగినప్పుడే నిలదొక్కుకునే అవకాశం ఉందని ఆమె తేల్చి చెప్పారు.
Also Read: CoronaVirus కలకలం.. ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ