Vidhi Movie: ఆ పెన్నుతో రాస్తే మరణశాసనమే.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ `విధి`
Vidhi Movie on Amazon Prime: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన విధి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోంది. జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Vidhi Movie on Amazon Prime: డిఫరెంట్ కంటెంట్‌తో ఆకట్టుకునేవిధంగా తెరకెక్కిస్తే.. ప్రేక్షకుల నుంచి కచ్చితంగా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇలా ఓ సరికొత్త కంటెంట్‌తో రూపొందిన చిత్రమే విధి. గతేడాది థియేటర్ల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది. శ్రీకాంత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రంజిత్.ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ రచన చేయడంతోపాటు కెమెరామెన్ బాధ్యతలు నిర్వర్తించాడు.
రోహిత్ నందా, ఆనంది హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో సందడి మొదలు పెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించిన 'విధి' మూవీ.. ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పెన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది.
ఆ పెన్‌తో ఎవరు రాసినా కూడా మరణిస్తుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది..? ఆ పెన్‌కు ఉన్న బ్యాగ్రౌండ్ ఏంటి..? పెన్ చేతికి వచ్చిన హీరో ఏం చేశాడు..? అనే ఆసక్తికరమైన అంశాలతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ప్లస్ అయింవది. ముఖ్యంగా ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు తప్పకుండా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: KTR Republic Day: గవర్నర్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యలు
Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook