వందేళ్ల నాటి విక్టోరియా కారులో సచిన్ దంపతలు షికారు !!
ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో బిజీగా గడుపుతున్న మాట్లర్ బ్లాస్టర్ సచిన్ ..ఖాళీ దొరకడంతో లండన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఒక వైవు కామెంటేటర్ గా వ్యహరిస్తూ...మరో టీమిండియా కుర్రాళ్లకు సలహాలు ఇస్తూ బిజీగా గడుపుతున్న మాట్లర్ బ్లాస్టర్ సచిన్ ..ఖాళీ దొరకడంతో లండన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం లండన్ లోని రాయల్ ఆటోమొబైల్ క్లబ్ ఫ్యామిలీతో సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న 119 ఏళ్ల నాటి విక్టోరియా కారు సచిన్ ను బాగా ఆకట్టుకుంది. కార్లంటే విపరీతమైన మోజుతో ఉండే సచిన్... వందేళ్లు పైబడిన ఆ పాత కారుతో లండన్ వీధుల్లో తన భార్యతో కలిసి సచిన్ ఎంచక్కా విహరించాడు. ఈ మీడియాలో కంటిలో పడింది. సచిన్ వింటేజ్ కార్ డ్రయివింగ్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇంకెదుకు ఆలస్యం మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి.