sushant singh rajput death effect: న్యూఢిల్లీ: బాలీవుడ్ దివంగత యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) ఆత్మహత్య చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతునే ఉంది. బాలీవుడ్‌లో నెపోటిజం ( Nepotism) వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ప్రముఖులపై ఫ్యాన్స్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య కేసును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్న సడక్ 2 సినిమాపై పడింది. ఈ సడక్ 2 సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ (Sanjay Dutt)‌, అలియా భ‌ట్ ( Alia Bhatt )‌, ఆదిత్యారాయ్‌కపూర్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం రెండు రోజుల క్రితం విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ట్రైలర్ వచ్చిరాగానే.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఎనిమిది మిలియ‌న్ల డిస్ లైకులు వ‌చ్చాయి. ఓ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో డిస్ లైకులు రావ‌డం ఇదే మొద‌టిసారి. Also read: Sadak 2 ట్రైలర్ విడుదల


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంపై అలియాభ‌ట్ వివాదాస్ప‌ద కామెంట్ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం, మ‌రోవైపు మ‌హేష్ భ‌ట్‌పై కూడా ఆరోప‌ణం రావ‌డ‌మే దీనికి కారణమని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆగస్టు 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో విడుదల కానుంది. 1991లో రిలీజ్ అయిన సడక్ సినిమాకు సీక్వెల్‌గా సడక్ 2 సినిమా వస్తోంది. Also read: Sadak 2: ఒక్కరోజే బ్యాక్ టు బ్యాక్ మూడు పోస్టర్లు విడుదల


అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితం సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ బారిన పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సడక్ 2 సినిమా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు సుశాంత్ అభిమానులు సడక్ 2 సినిమా రిలీజ్ అయ్యే హాట్‌స్టార్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో 95శాతం డిస్‌లైక్లు వచ్చిన సడక్ 2పై ఈ ప్రభావం ఎంతవరకు పడుతుందో చూడాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. Also read: దిశా అప్పుడు న‌గ్నంగా లేదు: ముంబై పోలీసుల క్లారిటీ