రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ''సాహో '' గాలి..బాలీవుడ్ లోనూ బలంగా వీస్తోంది. అతి తక్కువ టైంలోనే ఎక్కవ పైసా వసూళ్లకు పాల్పడుతోంది. నిన్నటితో నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇవాళ్టి వసూళ్లతో కలుపుకొని ఒక్క బాలీవుడ్ లోనే వంద కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేయబోతోంది. విడుదలైన జస్ట్ 4 రోజుల్లో సాహో సినిమా రూ.93 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.ఈ రోజు కనీసం 15-16 కోట్లు వస్తాయని మూవీ మేరక్స్ అంచనా వేస్తున్నారు. కనీసం 7 కోట్లు వచ్చినా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది. ః


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నార్త్ లో సాహో సరికొత్త రికార్డు


నార్త్ ఇండియాలో ఇలా 5 రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన సౌత్ సినిమాగా సాహో కొత్త రికార్డు సృష్టించబోతోంది. రిలీజ్ రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. నెగిటివ్ వేవ్ ను తట్టుకొని నిలబడి ఈ విధంగా భారీ వసూళ్లు చేపట్టడం గమనార్హం. బహుశ ఇది ఒక్క సాహోకే సాధ్యమేమో అనే టాక్ వినిపిస్తోంది. సాహోనా మజాకా !!