Sai Dharam Tej Emotional Note on Sita Ramam Movie: దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన, సుమంత్ ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ మీద స్వప్న చలసాని నిర్మించారు. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసాం అనే భావనతో బయటికి వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమా మీద సాయి ధరంతేజ్ కూడా ప్రశంసలు వర్షం కురిపించారు. అయితే ఆయన ఏకంగా సుదీర్ఘ లేఖ రాసి తన ప్రశంసలు అందించడం ఆసక్తికరంగా మారింది. డియర్ సీతారామం టీం అంటూ మొదలుపెట్టిన ఆయన నేను ఈ నోట్ చాలా సార్లు రాసి మళ్ళీ ఎడిట్ చేశాను ఎందుకంటే మీకు ఐ హేట్ యు చెప్పాలి అంటూ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ముందుగా స్వప్న అక్క ఐ హేట్ యు ఈ సినిమా కోసం మీరు రెండేళ్లు మిగతా అన్ని పనులు పక్కన పెట్టారు. రామ్, సీతల ప్రేమ కథను మీరు అంతగా నమ్మారు. మీరు ఒక రత్నాన్ని మాత్రమే నిర్మించలేదు మా అందరిలో నిజంగా నిజమైన ప్రేమ ఉందేమో అనే నమ్మకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఆ ప్రేమ వెనుక నడవబోతున్నాం అంటూ ఆయన పేర్కొన్నారు.


ఇక హను రాఘవపూడి గురించి మాట్లాడుతూ ప్రతి ఫ్రేమ్లోను మ్యాజిక్ చేయడంలో మీరు సఫలం అయ్యారు మీరు మలచిన ప్రతి క్యారెక్టర్ అంతే అద్భుతంగా నటించిన నటీనటులు సినిమాకు ప్రాణం పోశారని అన్నారు. మీరు ఒక అందమైన పెయింటింగ్ లేదా ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారని మీరు అన్నట్లుగానే మీకు ఉన్న సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఇక నాశనం అయిపోయినట్లే, ఫ్లయింగ్ కలర్స్ తో మీరు దాన్ని దాటారని తేజ్ పేర్కొన్నారు. ఇక కొన్ని వింటేజ్  సాంగ్స్ పాడడం కోసం ఎస్పీ చరణ్ ఆయన తండ్రి మ్యాజికల్ వాయిస్ తీసుకురావడానికి ప్రయత్నించారని అన్నారు.


దుల్కర్ నేను మీ గత సినిమాలు చూశాను మీరంటే నాకు చాలా అభిమానం అయితే ఈ సినిమాలో మీరు నటించినందుకు నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాన. ప్రతి సీన్ లో మీ పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మీరు రామ్ లాగానే ఊపిరి పీల్చుకున్నారు, రామ్ లాగానే కూర్చున్నారు, రామ్ లాగానే పరిగెత్తారు బేసికల్లీ రామ్ అనే పాత్రలో జీవించారు అని తేజ్ పేర్కొన్నారు. రష్మిక మీరు ఒక అద్భుతమైన నటిగా మీకు అనేక మెమొరబుల్ పర్ఫామెన్స్లు ఉంటాయి కానీ ఇది చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర. ఈ పాత్రలో మీరు చూపించే కాన్ఫిడెన్స్ మీ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి.


రామ్- సీత మధ్య ఒక మెసెంజర్ గా ఉన్నందుకు నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. సుమంత్ అన్న మీ పాత్ర అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు మళ్ళీ రావా అనే సినిమా నా ఫేవరెట్ సినిమా కానీ ఇప్పుడు ఈ సినిమా దాని స్థానాన్ని భర్తీ చేసింది. విశాల్ చంద్రశేఖర్ మీరు సినిమాకి ప్రాణం పోశారు,  సినిమాని ఫీల్ అవ్వడంలో మీ పాత్ర ప్రధానమైనది అని పేర్కొన్నారు. ఇక సీత గురించి మాట్లాడుతూ మీ మీద ఒక అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది. దయచేసి వారికి సహకరించి అరెస్టు అవ్వండి మళ్లీ పరిగెత్తకండి, ఇప్పటికే చాలా గుండెలు ద్రవిస్తున్నాయి. వారి మీద కొంచెం జాలి చూపండి అని పేర్కొన్నారు. ఇక మరచిపోయే ముందు ఐ హేట్ యు అంటూ ఆసక్తికరంగా రాసుకొచ్చారు.  


Also Read: Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బేబమ్మ.. ఎందుకో తెలుసా?


Also Read: Nanayathara: భర్త చేసిన పనికి నయనతారకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook