ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రితో కలిసి సరిహద్దుల్లో సల్మాన్ ఖాన్ సైక్లింగ్ !
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రితో కలిసి సల్మాన్ ఖాన్ సైక్లింగ్ !
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకుని ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్కడ దేశ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత పెమ ఖండు, కేంద్ర మంత్రి కిరణ్ రిజెజుతో కలిసి సైక్లింగ్‌కి వెళ్లాడు. ఓవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరోవైపు కేంద్ర మంత్రి సైక్లింగ్ చేస్తూ వెంట రాగా తాను మధ్యలో సైక్లింగ్ చేస్తున్న వీడియోను సల్మాన్ ఖాన్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా అందమైన పర్యాటక ప్రాంతాలు వున్న అరుణాచల్ ప్రదేశ్‌లో తన అప్‌కమింగ్ సినిమాను షూటి చేయిస్తానని వారికి మాట కూడా ఇచ్చాడట సల్మాన్ ఖాన్. సల్మాన్ ప్రస్తుతం భారత్ సినిమాలో నటిస్తున్నాడు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది మొదలు అప్పుడు దేశం విడిపోయిన తీరు, ఆ తర్వాత ఇన్నేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలను ఈ సినిమాలో ప్రముఖంగా చూపించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ జంటగా నటించగా.. దిశా పటాని, సునీల్ గ్రోవర్, టబు, ప్రముఖ టీవీ నటుడు ఆసిఫ్ షేక్ వంటి వాళ్లు ఎందరో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.