ముంబై: కండలు తిరిగిన శరీరంతో, తన ఫిట్‌నెస్ దాదాపు గత మూడు దశాబ్ధాలుగా బాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్న బిగ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ తాజాగా జిమ్ బిజినెస్‌లో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్‌కె-27 జిమ్ పేరిట ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి, అదే ఫ్రాంచైజీ పేరిట దేశవ్యాప్తంగా 300 జిమ్ కేంద్రాలు ప్రారంభించాలని సల్మాన్ ఖాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన తరపున మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీయింగ్ హ్యూమన్, బీయింగ్ స్ట్రాంగ్ ఫిట్‌నెస్ పరికరాల వ్యాపారం తర్వాత సల్మాన్ ఖాన్ చేయనున్న మరో వ్యాపారం ఇదే. 


ఫిట్‌నెస్ ట్రైనర్స్‌కి ఉపాధి అవకాశాలు, జిమ్ ఫ్రాంచైజీ కేంద్రం ప్రారంభించాలని ఆసక్తి కలిగిన వారికి ఆ అవకాశం కూడా కల్పించడంతోపాటు ప్రతీ ఒక్కరూ ఫిట్‌గా ఉండేందుకు తన వంతు పాత్ర పోషించాలనే లక్ష్యంతోనే సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.