Samantha Apologies : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణలు.. రౌడీ హీరో ఏమన్నాడంటే?
Samantha Apologies Vijay Devarakonda Fans సమంత తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ఆమె వల్ల ఖుషి సినిమా ఆలస్యం అవుతూనే వస్తోంది. ఈ సినిమాను పక్కన పెట్టి బాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
Samantha Apologies Vijay Devarakonda Fans సమంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో షూటింగ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కాశ్మీర్లో ఓ నెల రోజుల పాటుగా శివ నిర్వాణ ఈ జోడి మీద సీన్స్ షూట్ చేశాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు.
ఇక సమంత నెక్ట్స్ మంత్లోపు సెట్స్ మీదకు రాకపోతే.. కొత్త సినిమాను చేసుకుంటాను అని శివ నిర్వాణ చెప్పాడట. అందుకే ఈ సినిమా గురించి ఓ నెటిజన్ సమంతను అడిగేశాడు. విజయ్ ఖుషి సినిమా సంగతి ఏంటి? అని సమంతను ఓ ఫ్యాన్ నిలదీశాడు. దీంతో సమంత ఇలా స్పందించింది. ఖుషి సినిమా షూటింగ్ త్వరోలనే ప్రారంభిస్తాం.. విజయ్ ఫ్యాన్స్ నన్ను క్షమించాలి.. అని దండం పెట్టేసింది.
సమంత వేసిన ఈ ట్వీట్ మీద విజయ్ స్పందించాడు. నువ్ మళ్లీ పూర్తి ఆరోగ్యం.. చిరు నవ్వులతో తిరిగి సెట్స్ మీదకు రావాలని మేం అంతా కూడా ఎదురుచూస్తున్నాం అని విజయ్ ట్వీట్ వేశాడు. సమంత గత నెలలోనే బయటకు వచ్చింది. శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో మెరిసింది. ఆ తరువాత ముంబైలో తన వెబ్ సిరీస్ షూటింగ్ కోసం మకాం పెట్టేసింది.
రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. వరుణ్ ధావణ్, సమంత కాంబోలో ఈ వెబ్ సిరీస్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ నెలలోనే సమంత ఖుషి సినిమా సెట్స్‌లోకి వస్తోన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్ సినిమా క్యాస్టింగ్ ఇదే
Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook