Samantha Fighting Battles సమంత తన కెరీర్‌ మొదటి నుంచి ఎత్తుపల్లాలను చూస్తూనే వచ్చింది. సినిమాల పరంగా ఆమె కెరీర్‌కు ఏమీ ఢోకా లేదు. చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే వచ్చింది. సర్జరీలు చేసుకోవడం, డ్యాన్సుల్లో మెరుగుపడటం, నటనలోనూ మెలుకువలు నేర్చుకుంటూ ముందుకు దూసుకుపోతూ వచ్చింది. అయితే మధ్యలో సిద్దార్థ్‌తో ప్రేమ వ్యవహారం నడపడటం, పెళ్లి వరకు ఆలోచన వెళ్లడం, చివరి నిమిషంలో విరమించుకోవడం అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నాగ చైతన్యతో సమంత ప్రేమ వ్యవహారం, పెళ్లి, విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటారని, ఇలా విడిపోతారని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇంత వరకు కూడా ఈ ఇద్దరి విడాకులకు కారణం ఏంటన్నది తెలియదు. ఆ విషయాన్ని ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా బయటపెట్టరు. అయితే సమంత పట్ల ఇంకా నాగ చైతన్య ప్రేమను చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సమంత మాత్రం చై అంటే పీకలదాక కోపం ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది.


కరణ్ జోహర్ తన షోలో మీ భర్త చైతన్య అని సంబోధిస్తే.. నా భర్త కాదు. నా మాజీ భర్త అంటూ కోపంగా కరెక్ట్ చేసింది సమంత. మా ఇద్దరినీ ఒక రూంలో పెడితే.. అక్కడ కత్తుల్లాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అన్నట్టుగా సమంత చెప్పుకొచ్చింది. అలా విడాకుల తరువాత సమంత ఎప్పుడూ కూడా చై పట్ల వింతగా మాట్లాడుతూనే వచ్చింది.


[[{"fid":"262712","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సమంత కెరీర్‌ పీక్స్‌లో ఉందనుకునే సమయంలోనే ఇలా మయోసైటిస్‌ బయటపడింది. దాని వల్ల సమంత ఆరేడు నెలలు మంచానికే పరిమితమైంది. ఇకపై సినిమాల్లో నటించకపోవచ్చనే రూమర్లు కూడా వచ్చాయి. కానీ సమంత ఆ వ్యాధిని జయించింది. ఎంతో కష్టపడి, పోరాటం చేసి వ్యాధి మీద గెలుపును సాధించింది. ఇప్పుడు మునుపటి కంటే రెట్టింపు బలం, శక్తితో ముందుకు వచ్చింది. గుడి మెట్లు ఎక్కేస్తూ మొక్కులు తీర్చుకుంటోంది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తోంది.


అయితే సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది. ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త జాలి, దయతో మెలగండి అంటూ కోరింది సమంత.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook