Samantha Ruth Prabhu to Melbourne Indian Film Festival: నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది. విడాకులకు ముందే చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇక ఆ సిరీస్ తర్వాత విడాకుల ప్రకటించిన సమంతా చాలా కాలం పాటు ఆ కారణంగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో ఆమె చేసిన బోల్డ్ ఐటమ్ సాంగ్ తో మరోసారి ఇండియా వ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమంత ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేయగా యశోద సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయి పోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ మాత్రం జరుగుతోంది. అయితే ఒకపక్క సినిమాలతో మరోపక్క తన సోషల్ మీడియా అకౌంట్స్ తో బిజీ బిజీగా ఉండే సమంత తాజాగా ఒక అరుదైన గౌరవం అందుకున్నట్లు సమాచారం. అదేమిటంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సమంతకు ఆహ్వానం అందింది.


ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జరుగుతున్న నేపధ్యంలో దానికి సమంతకు ఆహ్వానం అందడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఫెస్టివల్ లో సమంత తన జీవితానికి కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలు పంచుకోబోతున్నారని సమాచారం. ఇక ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ గతంలో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లలో భాగమయ్యానని చెప్పుకొచ్చారు.


ఇక ఇప్పుడు అదే ఫిలిం ఫెస్టివల్ కి భారతీయ సినిమా ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొనడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్న సమంత భారతీయ సినిమాలను, భారతీయులను, సినీ ప్రేమికులను ఇలా అందరినీ ఒకే చోట చేర్చడం ఒక మంచి అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ క్యాపిటల్ అయిన మెల్బోర్న్ లో సమంత సినీ ప్రియులను కలవబోతోందట. 


Read Also: Ram Gopal Varma: రాం గోపాల్ వర్మకు ఊహించని షాక్.. 'లడకి'కి కష్టాలు


Read Also: Ileana D'Cruz : స్టార్ హీరోయిన్ అన్నతో ప్రేమలో ఇలియానా.. మాములు ట్విస్ట్ కాదుగా ఇది!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook