Ileana D'Cruz : స్టార్ హీరోయిన్ అన్నతో ప్రేమలో ఇలియానా.. మాములు ట్విస్ట్ కాదుగా ఇది!

Ileana D'Cruz dating with Katrina's brother: నటి ఇలియానా డిక్రూజ్ జీవితంలో మరోసారి ప్రేమ చిగురించింది. అవును ఆమె జీవితంలో మరో వ్యక్తి వచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 07:30 PM IST
  • గత కొన్నాళ్లగా బ్రేకప్ బాధలో ఇలియానా
  • మళ్లీ ప్రేమలో పడిన ఇలియానా
  • ఆ స్టార్ హీరోయిన్ సోదరుడితో అంటూ ప్రచారం
Ileana D'Cruz : స్టార్ హీరోయిన్ అన్నతో ప్రేమలో ఇలియానా.. మాములు ట్విస్ట్ కాదుగా ఇది!

Ileana D'Cruz dating with Katrina's brother: సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు ప్రేమలో పడటం విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి ఫేమస్ అయిన గోవా సుందరి ఇలియానా దిక్రూజ్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్  అనే ఫారినర్ తో ప్రేమలో పడి చానాళ్ళ పాటు ప్రేమాయణం నడిపింది. ఇక వీరిద్దరూ వివాహం చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తూ ఉన్న తరుణంలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇలియానా సదరు వ్యక్తికి బ్రేకప్ చెప్పేసింది.

అప్పటి నుంచి చాలా కాలం పాటు డిప్రెషన్ కి కూడా గురైన ఆమె బరువు పెరిగిపోయి సినిమాలకు కూడా దూరం అయిపోయింది. మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని భావించిన ఆమె తిరిగి తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాతో బిజీ అవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నించినా ఆ ఐడియా వర్కౌట్ అవ్వలేదు. దీంతో బాలీవుడ్ లోనే మరిన్ని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమె మరోసారి ప్రేమలో పడినట్లుగా బాలీవుడ్ లో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.  

ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అన్నయ్యతో ప్రేమలో పడింది అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. ఆమె కత్రినా అన్న సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఆయన యూకేలో మోడల్ అంబి అంటున్నారు. సెబాస్టియన్ లారెంట్ మిచెల్ గత సంవత్సరం ముంబై, రాజస్థాన్‌లలో కనిపించాడు, కత్రినా కైఫ్ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చారు. సెబాస్టియన్, ఇలియానా దాదాపు ఆరు నెలలుగా డేటింగ్‌లో ఉన్నారని అంటున్నారు.

అది మాత్రమే కాదు, ఈ జంట బాంద్రాలోని కత్రినా పాత ఇంట్లో మరియు లండన్‌లో కూడా తరచుగా కలుస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో, సెబాస్టియన్ మరియు ఇలియానా ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవడం కూడా పలు చర్చలకు తావిస్తోంది. అదీ కాక విక్కీ కౌశల్ తన వైఫ్ కత్రినా కైఫ్ పుట్టినరోజును జరుపుకోవడానికి మాల్దీవులలో ఒక ప్రైవేట్ పార్టీని ప్లాన్ చేశాడు. ఈ పార్టీలో సెబాస్టియన్, ఇసాబెల్, ఆనంద్ తివారీ, మినీ మాథుర్, సార్వారి బాగ్ ఉన్నారు. తాజాగా ఈ పార్టీ ఫోటోను ఇలియానా షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఫోటో చూడగానే వారిద్దరి మధ్య ప్రేమ చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన చేస్తారో లేదో చూడాలి. 

Also Read: Tollywood Shootings Bundh: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. షూటింగ్స్ బంద్?

Also Read: Srinu Vaitla: విడాకులకు సిద్దమైన డైరెక్టర్ శ్రీను వైట్ల-రూప వైట్ల.. అసలు ఏమైందంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x