కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. నటి సంజన, నటి రాగిణి ద్వివేది (Actress Ragini Dwivedi) కి డ్రగ్స్ సప్లయర్స్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కన్నడ నటి రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఛామరాజ్‌పేట్‌లోని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులు శుక్రవారం విచారణకు హాజరు కావాలని సూచించగా.. సోమవారం అయితే తాను విచారణకు వస్తానని లాయర్ ద్వారా నటి తెలిపింది. Ravichandran Ashwin: జీవితంలో అవి అత్యంత చెత్త రోజులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఒక్కసారి నటి ఇంటిపై, ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరో టీమ్ నటి రాగిణి ద్వివేదిని విచారణ నిమిత్తం అదుపులోకి (Ragini Dwivedi Detained In Drug Case) తీసుకున్నారు. తమ వాహనంలో నటిని విచారించేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Hyderabad Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే



కాగా, శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఇదివరకే నటి సంజనా స్నేహితుడు, మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నటి సంజనతో పాటు మరికొందరు నటీనటులకు విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. 
మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్ 
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు