బ్యాట్స్‌మెన్ నో బాల్ వినియోగించుకున్నట్లే మాకు ఫ్రీ బాల్ ఛాయిస్ కావాలంటూ కొత్త విధానాన్ని కోరిన టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. మరోసారి వార్తల్లోకెక్కాడు. గత ఆరు రోజుల క్వారంటైన్ సమయం తన జీవితంలోనే అత్యంత చెత్త రోజులు అంటూ (Ashwin About six day quarantine in UAE) ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ఆడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిసి అశ్విన్ యూఏఈకి కొన్ని రోజుల కిందట రావడం తెలిసిందే. Hyderabad Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే
కరోనా కారణంగా యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తుండగా.. అక్కడికి చేరుకున్న అన్ని జట్లను 6 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్ అనుభవాన్ని అశ్విన్.. తన జీవితంలోనే చెత్త రోజులంటూ అభివర్ణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ యూట్యూబ్ పేజీలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ‘గత ఐదు, ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నాను. కానీ నాకు బోర్ కొట్టలేదు. నా యూ ట్యూబ్ ఛానల్ పనులతో కాలక్షేపం చేశాను. Mohammed Shami: సిక్సర్లతో బౌలర్లను వణికించిన మహమ్మద్ షమీ!
ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉన్నాను. ఇవి నా జీవితంలోనే అత్యంత చెత్త రోజులు. తొలి రోజు బయటకి చూస్తే దుబాయ్ సరసు మాత్రమే కనిపించింది. కుడివైపు తిరిగి బుర్జ్ ఖలీసా చూశాను. కానీ ఎన్నిరోజులు ఇలా లోపల కూర్చుని బయటకు చూడాలి. ఇక్కడ చాలా వేడిగా కూడా ఉంది. మొబైల్ చాలా తక్కువగా వాడతాను. క్వారంటైన్‌కు రాకముందు సైతం వారం రోజుల్లో కేవలం 6 గంటలపాలు సెల్‌ఫోన్ వాడాను. ఇప్పుడు తప్పక వాడాల్సి వచ్చింది. ఏ ఇబ్బంది లేకుండా ఐపీఎల్ 2020 ప్రారంభం కావాలని’ అశ్విన్ ఆకాంక్షించాడు. మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు