మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశామని ఆ సినిమాలో నటించిన నటీనటులంతా ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తోంటే విన్నా... కానీ తాజాగా వారి ఫన్ మూమెంట్స్‌ని చూసే అవకాశం కూడా వచ్చింది. అవును షూటింగ్‌కి సంబంధించిన పలు దృశ్యాలను ఒక్క చోట చేర్చిన మేకింగ్ వీడియోను 'The Vibe of Sarileru Neekevvaru' పేరిట ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయశాంతి, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన పోసాని కృష్ణమురళి, విలన్ పాత్ర పోషించిన ప్రకాశ్ రాజ్, చిత్ర నిర్మాత దిల్ రాజు.. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. యావత్ సరిలేరు నీకెవ్వరు యూనిట్ సభ్యులు షూటింగ్‌ని ఎంజాయ్ చేశారని ది వైబ్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఆహ్లాదంగా జరగడంలో దర్శకుడు అనిల్ రావిపూడి కృషి ఎంతో ఉందని అన్నారు. మహేష్ బాబు చెప్పినట్టుగానే.. షూటింగ్ స్పాట్‌లో అనిల్ రావిపూడితో కలిసి ఆయన చాలా ఎంజాయ్ చేశారని ఈ వీడియో స్పష్టంచేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డె మరోసారి కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా అభిమానులకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి రానుంది. మహేష్ బాబు సెట్స్‌పై చేసిన ఎంజాయ్‌మెంట్‌ని మీరు సినిమాతో ఆస్వాదించాలంటే.. మరో రెండు రోజులు ఆగక తప్పదు.