ముదురుతున్న `సర్కార్` సినిమా వివాదం, 90 మంది అభిమానుల అరెస్ట్
చెన్నై: ముగురుదాస్, విజయ్ కాంబినేషన్లో తెరపైకి వచ్చిన 'సర్కార్' సినిమా వివాదం ముదురుతోంది. ఈ రోజు కూడా తమిళనాడులోని చాలా చోట్ల సినిమా ప్రదర్శన నిలిపివేశారు. చిత్రాన్ని అడ్డుకునే క్రమంలో పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు సినిమా పోస్టర్లని చించి వేశారు. అందోళనలో పాల్గొన్న 90 మంది అభిమానులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే మద్దతు దారుడు దేవరాజన్ ఈ మూవీపై సెన్సార్ బోర్డు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు .
హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్
సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఎదురుకావడంతో అభ్యంతరం సన్నివేశాల తొలగించాలని థియోటర్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతలపైఒత్తిడి తీసుకొస్తున్నారు..అలా చేయని పక్షంలో సినిమా ప్రదర్శించలేమని థియేటర్ యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. దీంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది. కాగా వివాదాస్పంగా మారిన సినిమాకు దర్శకత్వం వహించిన ముగురుదాస్ అరెస్ట్ చేస్తారంటూ రాత్రి హైడ్రామా నడించింది. దీంతో ఆయన ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
ప్రభుత్వ పథకాలు బద్నాం
సర్కార్ సినిమాలో ప్రభుత్వ పథకాలను బద్నాం చేసేలా సన్నివేశాలు ఉన్నాయన్నదే అన్నాడీఎంకే ఆరోపణ. దివంగత ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా పాత్రలు సన్నివేశాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పేరు కోమలవల్లి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి జయను కోమలవల్లిగా పిలుచుకుంటారు. దీంతో అన్నాడీఎంకే ఈ మేరకు అభ్యంతరం తెలుపుతోంది.