Delhi: ఖాతాదారులకు ఎస్‌బీఐ (SBI Bank) కీలక సూచనలను సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న ఆన్ లైన్ మోసాలను (Online Scams) దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులను హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఒక నాలుగు యాప్ ల గురించి తెలిపిన ఎస్‌బీఐ.. ఖాతాదారులు (SBI Bank Account Holders) కనుక ఆ యాప్ లను వాడితే వారి ఖాతా నుండి డబ్బులు మాయమయ్యే అవకాశాలున్నాయని ఖాతాదరులని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎనీడెస్క్‌ (AnyDesk App), క్విక్‌సపోర్ట్‌ (Quick Support), టీమ్‌వ్యూయర్‌ (Team Viewer App), మింగిల్‌వ్యూ (Mingle View App) యాప్‌లను వాడొద్దని, ఒకవేళ ప్రస్తుతం వాడుతుంటే మాత్రం వెంటనే ఫోన్ నుండి తొలగించాలని ఖాతాదారులకు సూచించింది. ఆన్ లైన్  మోసగాళ్లు కాల్స్ చేసి మాయమాటలు చెప్ఖాపి తాదారులను బురిడి కొట్టించి యాప్ లను ఇన్‌స్టాల్‌ చేసుకోమని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు నమ్మి మీరు ఈ యాప్ లను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు మాయం అవుతాయని తెలిపింది. 


Also Read: APEPCET 2021 Results: ఏపీఈపీసెట్ 2021 ఫలితాల విడుదల, అనంతపురం విద్యార్ధికి మొదటి ర్యాంకు


కిందటి నెలలో ఆన్ లైన్ కేటుగాళ్లు ఈ యాప్ లను ఫోన్ లో ఇన్‌స్టాల్‌ చేసుకోమని చెప్పి "150 మంది ఎస్‌బీఐ వినియోగదారుల (SBI Account Holders) నుండి దాదాపు 70 లక్షల రూపాయలు కాజేసారని ఎస్‌బీఐ (SBI) తెలిపనట్లు ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో ప్రచురించబడింది. ఈ విధంగా భాదితుల సంఖ్య పెరిగిపోవటంతో ఈ నాలుగు యాప్ లను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఎస్‌బీఐ  ఖాతాదారులకు సూచించింది. 


అంతేకాకుండా ఫోన్ల ద్వారా చేసే యూపీఐ లావాదేవీలు (UPI Transaction) చేసేపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మరియు తెలియని నంబర్ల నుండి వచ్చే  క్యూఆర్‌ కోడ్‌ (QR code) లేదా యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ (UPI Collect Request) వంటివి వస్తే వాటిని పట్టించుకోవద్దని సూచించింది. 


Also Read: Shikhar Dhawan divorce: శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా Ayesha Mukherjee వెల్లడి


ఎస్‌బీఐ పేర్లతో చాలా వరకు ఫేక్ వెబ్‌సైట్‌లు (SBI Fake Websites) ఉన్నాయని, వాటి జోలికి వెళ్ళకుండా, ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ (SBI Authorized Website) ద్వారానే అన్ని రకాల లావాదేవీలను జరపాలని ఖాతాదారులకు సూచించింది. అంతేకాకుండా, లావాదేవీలు జరిపే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసాకే కొనసాగించాలని మరియు లావాదేవీ ముగిసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుందని తెలిపింది. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగిందని లేదా లావాదేవి మీరు నిర్వహించని ఎడల వెంటనే 1800111109, 9449112211, 08026599990 నంబర్లను (SBI Customer Care Number) సంప్రదించాలని కోరింది. 


ఏదైనా తప్పుడు లావాదేవీ లేదా ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే 155620 నంబర్ ద్వారా సైబర్ క్రైమ్ (Cyber Crime Helpline Number) లో ఫిర్యాదు చేయాలని కోరింది. కావున ఖాతాదారులు బ్యాంక్ లావాదేవీలు చేసేపుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాతే లావాదేవీలు కొనసాగించటం మంచిది. 


Also Read: Heavy rains: ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ నివేదిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook