APEPCET 2021 Results: ఏపీఈపీసెట్ 2021 ఫలితాల విడుదల, అనంతపురం విద్యార్ధికి మొదటి ర్యాంకు

APEPCET 2021 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాల్ని విడుదల చేశారు. విద్యార్ధులు రేపట్నించి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2021, 12:21 PM IST
  • ఏపీఈపీసెట్ 2021 ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
  • రాష్ట్రవ్యాప్తాంగా 1 లక్షా 34 వేల 205 మంది అర్ఙత
  • అనంతపురం విద్యార్ధి నిఖిల్‌కు మొదటి ర్యాంకు
APEPCET 2021 Results: ఏపీఈపీసెట్ 2021 ఫలితాల విడుదల, అనంతపురం విద్యార్ధికి మొదటి ర్యాంకు

APEPCET 2021 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాల్ని విడుదల చేశారు. విద్యార్ధులు రేపట్నించి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంసెట్ 2021(Eamcet 2021 Results)ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజయవాడలో ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 34 వేల 205 మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ కోర్సులకు అర్హత సాధించారు. మొత్తంగా చూస్తే 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. క్వాలిఫై అయిన విద్యార్ధులు రేపట్నించే ర్యాంక్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అగ్రికల్చర్, ఫార్మా ఫలితాల్ని ఈనెల 14వ తేదీన ప్రకటించనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) తెలిపారు.

ఇంజనీరింగ్ విభాగంలో అనంతపురంకు చెందిన నిఖిల్ మొదటి ర్యాంకు సాధించగా..శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహంత నాయుడు రెండవ ర్యాంకు, కడప జిల్లాకు చెందిన తనీష్ 3వ ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన దివాకర్ సాయి 4వ ర్యాంకు, నెల్లూరుకు చెందిన మౌర్య రెడ్డి 5వ ర్యాంకు సాధించారు. ఏపీ ఎంసెట్ ఫలితాల్ని అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ఏపీ ఎంసెట్ పేరుతో నిర్వహించేవారు. అయితే దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులకు సంబంధించి నీట్ ప్రవేశపెట్టినప్పటి నుంచీ ఏపీఎంసెట్ నుంచి మెడికల్‌ను మినహాయించారు. ఏపీఈపీసెట్(APEPCET 2021 Results) పేరుతో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించిన అర్హత ప్రవేశ పరీక్షను ఆగస్టు 20,23,24,25 తేదీల్లో రెండు సెషన్ల చొప్పున నిర్వహించారు. ఆ ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి.

Also read: Heavy rains updates: ఈ జాబితాలోని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. IMD నివేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News