Seetha Kalyana Vaibhogame Review: డ్రీమ్ గేట్స్ బ్యానర్‌పై సుమన్ తేజ్, గరిమ చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందిన సినిమా సీతా కళ్యాణ వైభోగమే. రాచాల యుగంధర్ నిర్మాతగా వ్యవహరించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. జూన్ 21న పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో రివ్యూపై ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏంటంటే..?


దేవరకథ అనే గ్రామానికి ఊరి పెద్ద ధర్మకర్తగా జానకి రామయ్య (నాగినీడు) ఉంటారు. ఆ ఊర్లో బడి పంతులు మూర్తి (శివాజీ రాజా) ఉంటారు. వీరిద్దరికి ఊర్లో మంచి గౌరవ మర్యాదలుంటాయి. జానకి రామయ్య కూతురు సీత (గరిమ చౌహాన్), మూర్తి కొడుకు రామ్ (సుమన్ తేజ్) ఇద్దరు చాలా రోజులుగా ప్రేమించుకుంటూ ఉంటారు. సీత బావ రమణ (గగన్ విహారీ) ఊర్లో రౌడీలా ప్రవర్తిస్తూ.. కంటపడిన అమ్మాయిలను బలవంతంగా అనుభవిస్తుంటాడు. సీత ప్రేమ విషయం తెలుసుకోకుండా రమణతో ఎంగేజ్‌మెంట్ జరిపిస్తాడు జానకి రామయ్య. అయితే మూర్తి మాత్రం సీతా, రామ్‌ల పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో జానకి రామయ్యతో వాగ్వాదం జరగ్గా.. సీతను తీసుకువెళ్లి రామ్ పెళ్లి చేసుకుంటాడు.


పరువు పోయిందని కోపంలో.. కూతురు దూరమైందని బాధనలో జానకి రామయ్య ఆలయంలోని సీతాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చేస్తాడు. చివరికి ఊర్లో గుడిని మూసేస్తారు. ఊరి నుంచి పారిపోయిన సీతా, రామ్ మళ్లీ ఎందుకు తిరిగి గ్రామానికి రావాలని అనుకుంటారు..? వాళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి..? జానకి రామయ్య వీరి ప్రేమను అంగీకరించారా..? కోపంతో రగిలిపోయిన రమణ ఏం చేశాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


ఎవరు ఎలా నటించారు..?


స్క్రీన్‌పై తొలిసారి నటిస్తున్నా.. సుమన్ తేజ్‌, గరిమ చౌహాన్‌ల చక్కటి నటన కనబర్చారు. రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో ఆడియన్స్‌ను మెప్పించారు. విలన్ పాత్రలో గగన్ విహారి అద్భుతంగా నటించాడు. విహారీ క్రూరత్వంతో ఆడియన్స్‌కే చంపేయాలనేంత కోపం వస్తుంది. నాగినీడు, మూర్తి తమకు అచ్చొచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 


విశ్లేషణ..


సీతా కళ్యాణ వైభోగమే టైటిల్ చూడగానే మనకు తెలిసిన కథ చెప్పబోతున్నారని తెలిసిపోతుంది. రావణాసురుడు కారణంగా సీతారాముడు ఎదుర్కొన్న కష్టాలు మనందరికీ తెలిసిందే. కూతురు ప్రేమను అర్థం చేసుకోలేని తండ్రి.. ఆమె కోపం పెంచుకోవడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమా కూడా పాత పాయింట్‌తోనే తీసినా.. ఈతరానికి రామాయణం, రాముడు సీత విలువలు, మరిచిపోతోన్న మన సంస్కృతి గొప్పతనం అర్థమయ్యేలా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా సాగిపోగా.. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుంది. ఇక సెకాండాఫ్‌లో విలన్ క్రూరత్వం, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, తండ్రి కోసం కొడుకు చేసే పనులతో ఎమోషనల్‌గా సాగుతుంది. విజువల్ చక్కగా ఉన్నాయి. ఆర్ఆర్ సెట్ అయింది. చరణ్ అర్జున్ సాంగ్స్ వినసొంపుగా ఉండగా.. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.


రేటింగ్: 2.75


Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..


Also Read: కల్కి గురించి కీలక విషయంపై.. వీడని సస్పెన్స్.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter